పంట కాలనీలు..ప్రాసెసింగ్‌ యూనిట్లు....


Fri,May 17, 2019 02:37 AM

ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ఉద్దేశంతో పంటకాలనీల వైపు దృష్టి సారించింది. ప్రస్తుతం జిల్లాలో వాణి జ్య పంట అయిన పత్తి అధికంగా సాగవుతుండగా తర్వాత వరి సాగు చేస్తున్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్న బత్తాయి క్రమంగా వెనుకబడింది. ఇటీవల కూరగాయల సాగు పెరుగుతున్నప్పటికీ మార్కెటింగ్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక పప్పుదినుసులవైపు రైతాంగం ఆలోచనే చేయడం లేదు. ఈ కోణంలో వివరాలు సేకరిస్తున్న అధికార యంత్రాంగం జిల్లా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏ మేరకు అవసరం ఉంటాయి...ఇక్కడ నేలల పరిస్థితి ఏమి టి...ఏ పంట బాగా దిగుబడి వస్తుంది అనే కోణంలో డేటా సేకరిస్తున్నారు.

ఈ సర్వే అనంతరం సర్కార్‌ సూచన మేరకు మండలాల వారిగా, లేదంటే క్లస్టర్ల వారిగా పంట కాలనీలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో యంత్రాంగం ఉంది. అదే విధంగా పండించినటువంటి పంటలకు అనుగుణంగా రైతుకు గిట్టుబాటు ధర రావాలనే ఉద్దేశంతో ప్రాసెసింగ్‌ యూనిట్లను సైతం సర్కార్‌ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. పత్తి పండిస్తే జిన్నింగ్‌ మిల్లులు...వరి పండిస్తే రైస్‌ మిల్లులు అవసరం. ఇక బత్తాయి నిమ్మతోపాటు పప్పు దినుసులకు ప్రత్యేక ప్రాసెసింగ్‌ యూనిట్లు కావల్సి ఉంది. పండ్లు, మిర్చికి కోల్డు స్టోరేజీలు అవసరమని యోచించి వ్యవసాయ, ఉద్యాన, ఐకేపీ, పరిశ్రమలు, మార్కెటింగ్‌ శాఖల ఆధ్వర్యంలో ఈ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పి దిగ్విజయంగా నడిపించాలని ప్రణాళికలు రూపొందించి ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పి మార్కెటింగ్‌ శాఖ ఆద్వర్యంలో ప్రాసెస్‌ అయినటువంటి ఉత్పత్తులను విక్రయించే చర్యలు తీసుకోనుంది.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...