వైభవంగా మట్టపల్లి నృసింహుడి బ్రహ్మోత్సవాలు


Fri,May 17, 2019 02:34 AM

మఠంపల్లి : మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహుడి తిరుకల్యాణ మహోత్సవాలను గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రుత్వికులు విశ్వక్సేన పూజతో ప్రారంభించి పుణ్యహవాచనం, రుత్విగ్వరణం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, మత్స్యం గ్రహణం, అకురారోపణం, ధ్వజారోహణం, నవ కుంభారోపణం, అగ్ని ప్రతిష్టాపనం తదితర పూజా కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శాత్తుమరై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరి విజయకుమార్‌, ఈఓ ఉదయభాస్కర్‌, అర్చకులు పాల్గొన్నారు

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...