హస్తం పోటీ ఉత్తదేనా..?


Thu,May 16, 2019 02:34 AM

‘స్థానిక ఎమ్మెల్సీ’ పోటీపై కాంగ్రెస్‌ నేతల్లోనే అనుమానాలు
బలంతోపాటు ఐక్యత లేకున్నా పోటీ ఎందుకనే ప్రశ్నలు?
గతానికి, ప్రస్తుతానికి పోలిక లేనే లేదంటున్న విశ్లేషణలు
వ్యూహాత్మకంగా టీఆర్‌ఎస్‌.. భారీ మెజారిటీ కోసం కసరత్తు
పోటీలో ఉన్నా.. లేనట్టేనా..? నల్లగొండ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీపై ఆ పార్టీ నేతలనే ముంచెత్తుతున్న అనుమానాలివి. ఇప్పటికే వరుస పరాజయాలతో పార్టీ పరిస్థితి పాతాళంలోకి చేరిన నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఓటర్లలో 80శాతం మంది టీఆర్‌ఎస్‌లోనే కనిపిస్తున్నా.. పేరుకే పోటీ చేయడం తప్ప గెలుపునకు కనీస ప్రయత్నం సైతం చేయలేమనేది పలువురు హస్తం ముఖ్య నేతల అంతర్గత విశ్లేషణ. ఐదుగురు పేర్లు చర్చకు వచ్చినా.. పోటీకి ఏ ఒక్కరూ ముందుకు రాలేదంటేనే తమ ఓటమి అప్పుడే ఖరారైందని.. అయినా బరిలో నిలవడం ప్రత్యర్థి మెజారిటీని పెంచడమే అవుతుందని ఆ పార్టీ గెలుపు బాధ్యతలు మీదేసుకోవాల్సిన నాయకులే చెప్తుండడం కొస మెరుపు.
- నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ

హస్తం పోటీ ఉత్తదేనా..?
-స్థానిక ఎమ్మెల్సీ పోటీపై కాంగ్రెస్‌ నేతల్లోనే అనుమానాలు
-బలంతోపాటు ఐక్యత లేకున్నా పోటీ ఎందుకనే ప్రశ్నలు?
-గతానికి, ప్రస్తుతానికి పోలిక లేనే లేదంటున్న విశ్లేషణలు
-వ్యూహాత్మకంగా టీఆర్‌ఎస్‌.. భారీ మెజార్టీ కోసం కసరత్తు
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : స్థానిక సంస్థల శాసన మండలి ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పోటీ చేస్తున్నా.. గెలుపుపై సొంత పార్టీలోనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భార్య లక్ష్మిని ఆ పార్టీ బరిలో నిలిపినా.. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి ఆమె నామమాత్రం పోటీని సైతం ఇవ్వలేదని.. స్పష్టంగా టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం కనిపిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు. సొంత పార్టీ నాయకులే హస్తం పోటీపై నిర్లిప్తత వ్యక్తం చేయడానికి కారణాలు అనేకం ఉన్నాయి.

-పోటీకి ఎవరూ ముందుకు రాని పరిస్థితి...
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడక ముందు నుంచే ఈ స్థానం టీఆర్‌ఎస్‌ గెలుచుకోవడం ఖాయమనే అంచనా నెలకొంది. 20 15లో రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఈ స్థానంలో గెలిచినా.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మొత్తం 1086ఓట్లలో 80శాతం మంది టీఆర్‌ఎస్‌లో ఉన్నందున కాంగ్రెస్‌ గెలుపు సాధ్యం కాదనే విశ్లేషణ వినిపించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఐదుగురు సీనియర్‌ నేతల పేర్లను పరిశీలించింది. అయితే ఏ ఒక్కరు కూడా పోటీకి ముందుకు రాలేదు. ఓడిపోయే స్థానం తమకెందుకు? అనే ఎదురు ప్రశ్న సైతం వేసినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్‌లోని కొందరు నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ముందుకు నెట్టాలనే వ్యూహాన్ని పన్నినట్లు ఆ పార్టీలోనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముందుగా రాజగోపాల్‌రెడ్డి సైతం వేరే వాళ్లను పోటీలో నిలుపాలని సూచించినా.. ఎవరూ ముందుకు రాక పోవడంతో కనీసం పోటీలోనైనా నిలవాలనే ఉద్దేశంతోనే తన భార్య లక్ష్మిని అభ్యర్థిగా బరిలో దించినట్లు వినికిడి. ఇంత చేసి టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ కట్టబెట్టేలా తయారైందని ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

-టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం...
మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని స్థానిక సంస్థల్లో తిరుగులేని ఆధిపత్యం కలిగిన టీఆర్‌ఎస్‌.. 1086 ఓట్లలో 80శాతం పైగా కలిగి ఉంది. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లతోపాటు ఎక్స్‌ అఫీషియో సభ్యులు సైతం ఆ పార్టీలోనే ఎక్కువ మంది ఉన్నారు. దీనికితోడు గత ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఈసారి టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం వారీగా ఇన్‌చార్జీలను నియమించింది. అభ్యర్థి తేరా చిన్నపరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించే దిశగా ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...