జిల్లా జైలులో ఖైదీ ఉంగరాలు మాయం.!


Thu,May 16, 2019 02:30 AM

-విచారణ నిర్వహిస్తున్న జైళ్లశాఖ డీఐజీ సైదయ్య
నల్లగొండ, నమసే తెలంగాణ, (నల్లగొండక్రైం) : ఖైదీకి చెందిన బంగారు ఉంగరాలు కనిపించకుండాపోయిన విషయంపై బుధవారం జైళ్లశాఖ డీఐజీ సైదయ్య విచారణ చేపట్టారు. గతేడాది మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు శ్రవణ్‌ను జి ల్లా జైలుకు రిమాండ్‌కు తీసుకొచ్చిన సందర్భంలో అతని నుంచి 3 బంగారు ఉంగరాలు జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత శ్రవణ్‌ను వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించగా అతడి ఉంగరాలను నల్లగొండ జిల్లా జైలులోనే ఉంచారు.

ఇటీవల బెయిల్‌పై విడుదలైన శ్రవణ్‌ తన ఉంగరాలు తీసుకునేందుకు మంగళవారం నల్లగొండ జైలుకు వచ్చాడు. కానీ ఉంగరాలు జైలు సేఫ్‌లో కనిపించకపోవడంతో జైలు సూపరింటెండెంట్‌ కృష్ణమూర్తి బుధవారం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు జైలర్లు జలంధర్‌, అజయ్‌కుమార్‌, అనిల్‌కుమార్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ సురేష్‌కుమార్‌ తెలిపారు.

విషయం తెలుసుకున్న జైళ్లశాఖ డీఐజీ సైదయ్య జిల్లా జైలును సందర్శించి విచారణ చేపట్టారు. ప్రణయ్‌ హత్యకేసులో ముద్దాయిగా ఉన్న శ్రవణ్‌ ఉంగరాలు జిల్లా జైలులో ఉండగా అవి కనిపించకుండా పోయిన విషయమై విచారణ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఉంగరాల విలువ సుమా రు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుందని డీఐజీ పేర్కొన్నారు. ఉంగరాలు ఎవరు తీసుకెళ్లారనే దానిపై విచారణ నిర్వహిస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకొని, నిందితునికి న్యాయం చేస్తామన్నారు

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...