వరికొయ్యలకు నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు


Thu,May 16, 2019 02:28 AM

-రహదారిపైకి విస్తరించిన మంటలు
-రాకపోకలకు అంతరాయం
నేరేడుచర్ల : వరికొయ్యలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో రహదారి వెంట కలపకు మంటలు అంటుకొని వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. బుధవారం నేరేడుచర్ల శివారులో ఈ ఘటన జరిగిన ఘటన వివరాలివి.. గుర్తు తెలియని వ్యక్తులు తమ పొలాల్లో వరికొయ్యలకు నిప్పంటించడంతో మంటలు వ్యాపించాయి. నేరేడుచర్ల-మిర్యాలగూడ ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఇటీవల రహదారికి ఇరువైపులా తొలగించిన చెట్ల మొద్దులకు మం టలు అంటుకొని రోడ్డుపైకి విస్తరించాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటం కం కలిగింది. దట్టంగా అలుముకొన్న పొగతో ద్విచక్రవాహనదారులు, ఆటోల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. వరి కొయ్యలకు నిప్పు పెట్టవద్దని అధికారుల హెచ్చరిస్తున్నా రైతులు పట్టించుకోవడం లేదని పలువురు అంటున్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...