రైలు కిందపడి గుర్తుతెలియని యువకుడి ఆత్మహత్య


Thu,May 16, 2019 02:27 AM

దామరచర్ల : రైలు కిందపడి గుర్తుతెలియని యువకుడు(30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని కొండ్రపోల్‌ సమీపంలో బుధవారం జరిగింది. రైల్వే హెడ్‌కాస్టేబుల్‌ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కొండ్రపోల్‌ సమీపంలో రైలుపట్టాలపై యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా దవాఖాన మార్చురీకి తరలించారు. మృతుడి ఒంటిపై గులాబీరంగు చెక్స్‌ షార్ట్‌ ధరించాడు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పుస్తెలతాడు అపహరణ

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...