వడదెబ్బతో ఇద్దరు మృతి


Thu,May 16, 2019 02:26 AM

మాల్‌/ కట్టంగూర్‌ : నల్లగొండ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బతో బుధవారం ఇద్దరు మృతి చెందారు. చింతపల్లి మండలం బోటిమీదితండాకు చెందిన నేనవావత్‌ పూల్యా(54) ఉదయం తన పొలంలో చెట్లకొమ్మలు నరికేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఎండతీవ్రతకు స్పృహ కోల్పోయి పడిపోవడంతో గుర్తించిన స్థ్ధానికులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కట్టంగూర్‌ మండలం మునుకుంట్ల గ్రామానికి చెందిన ముడుసు ఆందోళ్‌(90) ఎండతీవ్రతకు తాళలేక మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో చిక్సిత అందిస్తుండగా పరిస్థితి విషమించి తెల్లవారుజామున మృతిచెందాడు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...