రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి తీవ్రగాయాలు


Thu,May 16, 2019 02:26 AM

నకిరేకల్‌ , నమస్తే తెలంగాణ : అదుపుతప్పి కారు బోల్తాపడి ఒకే కు టుంబానికి చెందిన ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నకిరేకల్‌ పట్టణ శివారులో 65వ నెంబర్‌ జాతీయరహదారిపై బుధవారం జరిగింది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నగరంలోని ఆర్కేపురం ప్రాంతానికి చెందిన ఎం.శ్రీధరన్‌ కుటుంబ సభ్యులతో కలిసి కారులో విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయానికి బయల్దేరాడు. నకిరేకల్‌ పట్టణ శివారుకు రాగానే మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు దిగువకు దూసుకెళ్లి పల్టీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న శ్రీధరన్‌తోపాటు ఎం.సంగీత, ఎం.అర్షిత్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఎం.భానురేఖ, ఎం.శంశాత్‌కు స్వల్పగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని నార్కట్‌పల్లిలోని కామినేని దవాఖానకు తరలించారు. స్వల్పగాయాలైన వారిని నకిరేకల్‌ ప్ర భుత్వ దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స చేశారు.

బైకులు ఢీకొని ముగ్గురికి..
కట్టంగూర్‌ : ఎదురెదురుగా బైకులు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలోని కురుమర్తి రోడ్డు వద్ద బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కట్టంగూర్‌లోని ఇందిరమ్మకాలనీకి చెందిన బి.చంద్రశేఖర్‌, దుగినవెల్లికి చెందిన ఎన్‌.స్వామి బైక్‌పై కట్టంగూర్‌ నుంచి కాలనీకి బయల్దేరారు. కురుమర్తి స్టేజీ వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్‌ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో స్వామి, చంద్రశేఖర్‌తో పాటు అంబేద్కర్‌నగర్‌కు చెందిన ఎం.వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చిక్సిత కోసం నార్కట్‌పల్లి కామినేని దవాఖానకు తరలించారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...