ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ


Thu,May 16, 2019 02:25 AM

-పరీక్ష ఫీజు షెడ్యూల్‌ విడుదల
రామగిరి: పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన పీజు షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకులు విడుదల చేసినట్లు డీఈఓ పి. సరోజిని దేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 27 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అదే విధంగా రూ. 50 అపరాధ రుసుంతో పరీక్ష జరగబోయే తేదీకి రెండు రోజుల ముందు వరకు చెల్లించవచ్చన్నారు.

3 లేదా అంతకన్నా తక్కువ సబ్జెక్టులకు రూ. 110, 3 కన్నా ఎక్కువ సబ్జెక్టులకు రూ. 125ను చలానా ద్వారా జమ చేయాలన్నారు. విద్యార్థులు చెల్లించిన ఫీజులను ప్రధానోపాధ్యాయులు సకాలంలో అందజేయాలని సూచించారు. పరీక్షలు జూన్‌ 10 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...