ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన


Thu,May 16, 2019 02:24 AM

-గిరిజన గురుకులాల ప్రాంతీయ అధికారి సుధాకర్‌
అడవిదేవులపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాల్లో ఉత్తమ విద్య అందిస్తున్నట్లు గిరిజన గురుకులాల ప్రాంతీయ అధికారి సుధాకర్‌ అన్నారు. మండలంలోని దూద్యతండాకు చెందిన కుర్రా సుగుణ, అంబాలి దంపతుల కుమారుడు కుర్రా శ్రీను పదో తరగతిలో 10 జీపీఏ మార్కులు సాధించాడు. అతను అవంతిపురం ట్రైబల్‌ వెల్పేర్‌ పాఠశాలలో 10వ తరగతి చదివి ఉత్తమ మార్కులు సాధించినందుకు గానూ బుధవారం జిల్లా గిరిజన గురుకులాల ప్రాంతీయ అధికారి డి.సుధాకర్‌ అతడి ఇంటికి వెళ్లి విద్యార్థిని సన్మానించారు.

ఈ సందర్బంగా డి.సుధాకర్‌ మాట్లాడుతూ తండాప్రాంతం నుంచి వచ్చి తల్లి దండ్రుల ఆర్థిక ఇబ్బందులను అర్దంచేసుకుని కష్టపడి చదివి 10 జీపీఏ సాధించడం గొప్ప విషయమన్నారు. కుర్రా శ్రీనుకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు అందించి ఉన్నత విద్యకు తొడ్పాటునందిస్తానన్నారు. కార్యక్రమంలో అవంతీ పురం ట్రైబల్‌ వెల్పేర్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ అజయ్‌కుమార్‌, హౌస్‌ మాస్టర్‌ బి.సక్రు తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...