పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల పరిశీలన


Thu,May 16, 2019 02:23 AM

నీలగిరి: ఈనెల 23న దుప్పలపల్లిలోని గోదాములో జరుగనున్న నల్లగొండ పార్లమెంట్‌ ఎన్నికల లెక్కింపు ఏర్పాట్లను బుధవారం కలెక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌ పరిశీలించారు. గోదాములో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రత ఏర్పాట్లను పరిక్షించి రిజిస్టర్‌లో సంతకాలు చేశారు. సీఆర్‌పీఎఫ్‌ భద్రత బలగాలు స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించేందుకు కౌంటింగ్‌ హాలులో ఏర్పాట్లు ప్లాన్‌ మ్యాప్‌ వారీగా సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ పంచాయతీరాజ్‌, డీఈలతో కలెక్టర్‌ చర్చించారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్‌కు కౌంటింగ్‌ హాలులో ఏర్పా ట్లు, కౌంటింగ్‌ బయట కౌంటింగ్‌ సిబ్బందికి, ఏజెంట్లకు వేర్వేరుగా కౌంటింగ్‌ హాల్స్‌ కు వెళ్లేందుకు బారికేడింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు.

కౌంటింగ్‌ హాలు వద్ద, కౌంటింగ్‌ హాల్‌ నియోజకవర్గాల వారీగా దారిచూపే మార్గ సూచిక లు, సైన్‌బోర్డు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. రిటర్నింగ్‌ అధికారి హాల్‌పై ఏర్పాట్లను చర్చించా రు. రిటర్నింగ్‌ అధికారి గదిలో అబ్జర్వర్‌, రిటర్నింగ్‌ అధికారి, పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెం ట్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌, ఈటీబీపీఎస్‌ లెక్కింపుకు ఏర్పా ట్లు చేయాలని, మీడియాసెంటర్‌ ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్‌ డీఈని ఆదేశించారు. కౌంటింగ్‌ గోదాం గోడ పక్కన గడ్డి కుప్పలను తొలగించాలన్నారు. కలెక్టర్‌తో సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాస్‌లు, డీపీఆర్వో శ్రీనివాస్‌, పంచాయతీరాజ్‌ డీఈ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...