నేటి నుంచి శ్రీలక్ష్మీ నృసింహుడి తిరుకల్యాణ మహోత్సవాలు


Thu,May 16, 2019 02:17 AM

మఠంపల్లి : పంచనారసింహ క్షేత్రంలో ఒకటిగా వెలుగొందుతున్న మఠంపల్లిలోని శ్రీ రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత నృసింహుని బ్రహోత్సవాలు నేడు ఉదయం 7 గంటలకు విశ్యక్షేణ పూజతో ప్రారంభమవుతుందని ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది తెలిపారు. పుణ్యాహవాచనం ఆచార్యాధి రుద్విగ్వరణం, రక్షబంధనం, అకండధీపారాధన, మృత్యంగ్రహణం, అంకురారోపణం, ధ్వజారోహణం, నవకుంభారోపనం, అగ్నిప్రతిష్టాపనం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరి విజయ్‌కుమార్‌, ఆలయ కార్యనిర్వాణాధికారి ఉదయభాస్కర్‌ బుధవారం తెలిపారు.

అట్టహాసంగా అధ్యనోత్సవాలలో భాగంగా బుధవారం ఆలయ అర్చకులు స్వామి వారికి పరమపద ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాత్రి గరుడ వాహన సేవ నిర్వహించారు. 12 అల్వార్లు భగవానుని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ లోక కల్యాణానికి అందించిన దివ్యప్రభందాది వేదపారాయణాలు అధ్యాపక అర్చకులు పఠించారు. కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు తూమాటి శ్రీనివాసచార్యులు, కుమ్మరికుంట్ల బద్రినారాయణాచార్చులు, ముడుంబై అనంతచార్యులు, ధర్మకర్తలు, ఈఓ, భక్తులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...