అట్టహాసంగా టీఎస్‌పీఈసెట్‌ ప్రారంభం


Thu,May 16, 2019 02:16 AM

-జెండా ఊపి క్రీడలను ప్రారంభించిన చైర్మన్‌ ప్రొ.అల్తాఫ్‌ హుస్సేన్‌, కన్వీనర్‌ సత్యనారాయణ
- తొలి రోజు 345మంది అభ్యర్థుల హాజరు
ఎంజీ యూనివర్సిటీ : తెలంగాణలోని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాలల్లో బీపీఈడీ, యూజీడీపీఈడీలో ప్రవేశానికి నిర్వహించే ‘టీఎస్‌పీఈసెట్‌'-2019 క్రీడోత్సవం బుధవారం నల్లగొండలోని మహాత్మగాంధీ యూనివర్సిటీలో అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తరలిరావడంతో తెల్లవారుజామునే అంతా సందడిగా కనిపించింది. ఫిజికల్‌ ఎఫిసెన్సీ క్రీడలను టీఎస్‌పీఈసెట్‌ చైర్మన్‌, ఎంజీయూ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌, కన్వీనర్‌ ప్రొ.వి.సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. తొలి రోజు ఉదయం 5.30 నుంచి 11గంటల వరకు వివిధ అంశాల్లో క్రీడా పరీక్షలు నిర్వహించారు. క్రీడా పరీక్షలకు వచ్చిన విద్యార్థులు తమ ప్రతిభను చూపి విజయం సాధించేందుకు పోటీ పడ్డారు. 400 మార్కులకు జరిగిన పోటీ పరీక్షల్లో విద్యార్థులు తలపడ్డారు.

పోటీ పడిన అంశాలు..
పురుషుల విభాగంలో జరిగిన ఫిజికల్‌ ఎపిసియన్సీ టెస్టుకు 100మీటర్లు, 800మీటర్ల రన్‌, 6 కేజీల షార్ట్‌ఫుట్‌, లాంగ్‌జంప్‌, హైజంప్‌ జరిగాయి. వీటికి 400మార్కులు కేటాయించారు. ఈ పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికే విజయం వరించనుంది. తొలిరోజు 345మంది హాజరు& తొలి రోజు బీపీఈడీ, డీపీఈడీ కోసం దరఖాస్తు చేసుకున్న వారు 512మంది హాజరు కావాల్సి ఉండగా 345మంది హాజరయ్యారు. వీరిలో బీపీఈడీకి 280 మందికి 182 మంది హాజరు కాగా 98మంది గైర్హాజరయ్యారు. డీపీఈడీలో 232 మందికి 163మంది హాజరయ్యారు. గైర్హాజరైన విద్యార్థులు సరైన కారణాలు చూపితే ఈనెల 21లోగా హాజరయ్యేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్‌ ప్రొ.ఎం.యాదగిరి, స్పోర్ట్సు బోర్డు కార్యదర్శి డా.జి.ఉపేందర్‌రెడ్డి, హాస్టల్స్‌ డైరెక్టర్‌ మారం వెంకటరమణారెడ్డి, పీడీలు డా. వై.శ్రీనివాసరెడ్డి, ఆర్‌.మురళి తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...