పిడుగుపాటుకు ముగ్గురు బలి


Thu,May 16, 2019 02:12 AM

-మృతుల్లో బాలిక, బాలుడు, మహిళ
-అందరూ వ్యవసాయ భూముల్లోనే మృతి
-పలుచోట్ల ఈదురు గాలుల బీభత్సం కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు...
జిల్లాలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. పిడుగు పాటుకు తిప్పర్తి మండలం సిలార్మియాగూడెంలో బాలిక, డిండి మండలం బ్రాహ్మణపల్లిలో బాలుడు, చింతపల్లి మండలం రాయినిగూడెంలో మహిళ మృతి చెందారు. శాలిగౌరారం, నార్కట్‌పల్లి, డిండి, చండూరు, కనగల్‌,
తిరుమలగిరి సాగర్‌ మండలాల్లో ఈదురు గాలులకు ఇళ్ల రేకులు ఎగిరిపోగా, చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌ స్తంభాలునేలకొరిగాయి.

నల్లగొండ, నమస్తేతెలంగాణ: జిల్లాలో బుధవారం కురిసిన వర్షం తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. జిల్లాలోని ఆయా ప్రాంతాలలో మోస్తరు వర్షం కు రువగా పిడుగు పడి ముగ్గురి ప్రాణాలు బలిగొంది. ఆయా ప్రాంతాలలో మధ్యాహ్నం నుంచే వాతావరణంలో మార్పులు జరిగి చల్లదనం చోటు చేసుకుంది. శాలిగౌరారం, నార్కట్‌పల్లి, డిండి, చం డూరు, కనగల్‌, తిరుమలగిరిసాగర్‌ మండలాల్లో వర్షం కురిసింది. తిప్పర్తి మండలంలోని సిలార్మియాగూడెంలో జక్కలి మాధవి(16)అనే యువతి పిడుగుపడి మృతి చెందింది. డిండి మండలంలోని బ్రాహ్మణపల్లిలో పిడుగు పాటుతో ముడావత్‌ గణే ష్‌ (14)అనే బాలుడు పశువులకు నీరు తాపేందు కు వెళ్లి మృతి చెందాడు. చింతపల్లి మండ ల పరిధిలోని రాయినిగూడెం గ్రామానికి చెందిన దూదిమెట్ల విజయ(30)తన వ్యవసాయ పొలంలో పనిచేస్తుండగా మధ్యాహ్నం వర్షం రావడంతో పాటు పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందింది.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...