ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏడు పోలింగ్‌ కేంద్రాలు


Thu,May 16, 2019 02:09 AM

-ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం ఓటర్లు 1086
-31న పోలింగ్‌.. జూన్‌ 3న నల్లగొండలో కౌంటింగ్‌
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శాసన మండలి ఉప ఎన్నిక కోసం మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా ఏడు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, భు వనగిరి, సూర్యాపేట, కోదాడ, నల్లగొండ, దేవరకొండతోపాటు చౌటు ప్పల్‌ లోనూ ఈ పోలింగ్‌ కేంద్రాల్లో ఆయా ప్రాంతాల పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 1086ఓటర్లు ఉన్న ఈ స్థానం కోసం ఈ నెల 31న పోలింగ్‌ నిర్వహిస్తారు. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం వెల్లడిస్తారు. ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి రా జీనా మాతో ఉప ఎన్నిక వచ్చిన ఈ ఎమ్మెల్సీ సీటు కోసం టీఆర్‌ఎస్‌ నుంచి తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ కేంద్రాలు
కేంద్రం ఓటర్లు చిరునామా
నల్లగొండ 198 ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల
మిర్యాలగూడ 149 జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, బకల్‌వాడ
భువనగిరి 165 ఎంపీడీఓ కార్యాలయం
సూర్యాపేట 203 ఎంపీడీఓ కార్యాలయం,
దేవరకొండ 137 ఎంపీడీఓ కార్యాలయం
కోదాడ 151 జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ (బాయ్స్‌)
చౌటుప్పల్‌ 83 ఎంపీడీఓ కార్యాలయం

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...