పకడ్బందీగా ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు


Fri,April 26, 2019 01:10 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ : జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఓపెన్ కో ఆర్డినేటర్ మంగళ తెలిపారు. గురువారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండలో ఏర్పాటు చేసిన 15 పరీక్ష కేంద్రాల్లో 4,090 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా వీరిలో 10వ తరగతికి 2,635 మంది, ఇంటర్ పరీక్షలు 1,455 మంది రాస్తున్నట్లు తెలిపారు. దేవరకొండ మోడల్ స్కూల్‌లో 350 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 260, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 336 మంది, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 207 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. గతంలో నల్లగొండలో పరీక్ష కేంద్రం ఉండడం వల్ల దూరభారంతో దేవరకొండ ప్రాంత విద్యార్థులకు ఇబ్బందులు కల్గుతుందని ఈ ప్రాం త ప్రజాప్రతినిధుల విన్నపం మేరకు దేవరకొండలోనే ఓపెన్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

ఓపెన్ స్కూల్ పరీక్షలకు 3691 మంది హాజరు
రామగిరి : జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఓపెన్ స్కూల్ పరీక్షల్లో ఇంగ్లీష్ పేపర్‌కు 3691 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈఓ పి.సరోజినిదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్షకు 1576 హాజరు కావల్సి ఉండగా 1401 మంది హాజరయ్యారని, 175 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. అదే విధంగా పదో తరగతి పరీక్షకు 2602 మందికి 2290 హాజరు కాగా 312 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలను ప్లయింగ్ స్క్యాడ్ బృందాలు తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...