ఇక సమరమే..!


Thu,April 25, 2019 03:38 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ: తొలివిడతలో దేవరకొండ రెవెన్యూ డివిజన్‌లో జరుగుతు న్న ప్రాదేశిక ఎన్నికలకు బుధవారంతో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరిరోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు పోటెత్తాయి. దేవరకొండ డివిజన్ పరిధిలోని 10 మండలాల పరిధిలో 109 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా మొత్తం 1,104 నామినేషన్లు దాఖలయ్యాయి. 10 జడ్పీటీసీ స్థానాలకు 167 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నాంపల్లి మండలంలో అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. నేరడుగొమ్ము మండలంలో ఎంపిటీసీ స్థానాలకు అత్యల్పంగా 77 నామినేషన్లు దాఖలు కాగా, జడ్పీటీసీ స్థానాలకు దేవరకొండ మండలంలో అత్యల్పం గా 9 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. దేవరకొండలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రాదేశిక ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో నామినేషన్ల ప్రక్రియను ప్రాదేశిక ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎం.చంపాలాల్ పర్యవేక్షించారు.

జడ్పీటీసీ స్థానాలకు 167 నామినేషన్లు
దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 జడ్పీటీసీ స్థా నాలకు మొత్తం 167 నామినేషన్లు దాఖలయ్యాయి. డివిజన్‌లోనే అత్యధికంగా నాం పల్లి జడ్పీటీసీ స్థానానికి 29 మంది 32 నామినేషన్లు దాఖలు చేశారు. అత్యల్పం గా దేవరకొండ జడ్పీటీసీ స్థా నానికి నలుగురు అభ్యర్థులు 9 నామినేషన్లు దాఖ లు చేశారు.

ప్రాదేశిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి: చంపాలాల్
ప్రాదేశిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ప్రాదేశిక ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎం.చంపాలాల్ సూచించారు. దేవరకొండ, కొండమల్లేపల్లిలలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు ఓటర్లకు తగిన విధంగా బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్‌ను పంపిణీ చేయాలన్నారు. ఆయనవెంట ఆర్డీఏ గుగులోతు లింగ్యానాయ క్, ఎంపీడీఓ జె.పాండు తదితర అధి కారులు ఉన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...