రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు


Thu,April 25, 2019 03:38 AM

హాలియా, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతైందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పెద్దవూర మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్‌హాల్‌లో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సం దర్భంగా మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్బిడి కృష్ణారెడ్డి, అబ్బిడి అన్మంతరెడ్డి, ఉట్లపల్లి గ్రామ నాయకులు వాసుదేవుల సత్యనారాయణరెడ్డి, పెద్దగూడెం గ్రామానికి చెం దిన కటకం జయమ్మ శంభయ్య, వెల్మగూడెం గ్రామానికి చెందిన దాసిరెడ్డి ధర్మారెడ్డిలతోపాటు మరికొందరికిలతోపాటు మరో 500 మంది కార్యకర్తలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి, నోముల వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్ పార్టీలో పెద్దఎత్తున చేరుతున్నారని అన్నారు. సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు.

30 ఏండ్లు గా జానారెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధ్ది శూన్యమన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్శితులై 30 ఏండ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న నాయకులంతా టీఆర్‌ఎస్ చేరుతున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీలు తమ ఉనికిని పూర్తిగా కోల్పోయాయని అన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య 2014 ఎన్నిక ల్లో ఓడిపోయినప్పటికి గత ఐదేండ్లుగా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయ కురువృద్ధు డైన జానారెడ్డి ఓడించారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, నల్లగొండ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎన్నికల్లో అన్ని స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు తక్కెళపల్లి రవీందర్‌రావు, రైతు సమన్వయసమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్‌నాయక్, నాయకులు యడవల్లి విజయేందర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, సర్పంచ్ కర్నాటి విజయభాస్కర్‌రెడ్డి, డివిఎన్‌రెడ్డి, కర్ణ బ్రహ్మానందరెడ్డి, మ ండలాధ్యక్షుడు గుంటక వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

136
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...