పరిషత్ ఎన్నికలలో సత్తా చాటాలి


Wed,April 24, 2019 02:15 AM

-టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి కలిసికట్టుగా పని చేయాలి
-నార్కట్‌పల్లి జడ్పీటీసీగా బండా నరేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
నార్కట్‌పల్లి: మూడో విడుతలో జరుగనున్న జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో నార్కట్‌పల్లి మండలంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి సత్తా చాటాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పట్టణ కేంద్రంలోని శబరి గార్డెన్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం మండల జడ్పీటీసీ సభ్యుడిగా బండా నరేందర్‌రెడ్డిని బరిలో నిలుపుతున్నామని, ఆయనను గెలిపిస్తే జడ్పీ చైర్మన్‌గా ఎన్నికవుతారని పేర్కొన్నారు. ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా అందజేయాలని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. గురువారం నార్కట్‌పల్లిలో విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి భారీ బహిరంగ సభ ఉన్నందున మండలంలోని కార్యకర్తలు అధిక సంఖ్యంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బహిరంగ సభకు ముందు పట్టణంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీకి ప్రతి గ్రామం నుంచి 100 బైక్‌లతో తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం టీఎస్ ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి మాట్లాడారు. టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సట్టుసత్తయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య, ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, జడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, వైస్ ఎంపీపీ పుల్లెంల పద్మ ముత్తయ్య, రైతు సమన్వయ సమతి మండల అధ్యక్షుడు యానాల అశోక్ రెడ్డి, సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, పుల్లెంల అచ్చాలు గౌడ్, రాదారపు విజయలక్ష్మి, మేకల రాజిరెడ్డి, చిరుమర్తి యాదయ్య, బాజ యాదయ్య, ఎండీ రహీంఖాన్, కూకుట్ల దేవేందర్, దుబ్బాక రాంమల్లేష్, శ్రీధర్, యామ దయాకర్, ముంత వెంకన్న, నాంపల్లి శ్రీను, నల్ల వెంకన్న, బైడ్డి శ్యాంసుందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...