భర్త కోసం న్యాయ పోరాటం


Wed,April 24, 2019 02:14 AM

-చట్టాన్ని ఉల్లంఘించిన యువతిపై కేసు
నార్కట్‌పల్లి : భర్త కోసం భార్య న్యాయ పోరాటం చేసిన ఘటన మండల పరిధిలోని గోపలాయపల్లి శివారులో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ దాచేపల్లి విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గోపలాయపల్లి గ్రామానికి చెందిన గుండెబోయిన గోపికి నల్లగొండ జిల్లా తిప్పర్తి గ్రామానికి చెందిన మర్రి దీపతో ఏడాది క్రితం పెద్ద మనుషుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెల్లి జరిగిన నెల నుంచే భార్యభర్తలకు అనుమానాలతో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇరువురు కుటుంబసభ్యులు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు. అయినప్పటికి గొడవ కొలిక్కిరాకపోవడంతో ఈ నెల 18న దీప నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్‌లో గోపిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఆ తర్యాత అక్కడే గోపి తరపున పెద్ద మనుషులు, దీప తరపున పెద్ద మనుషులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణకు పాల్పడిన గోపి బంధువులపై 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో మరోసారి కేసు నమోదైంది. ఈ నెల 20న దీప బంధువులు రహస్యంగా వచ్చి గోపి ఇంటిపై దాడి చేసి గాయపర్చడంతో దీప బంధువులపై నార్కట్‌పల్లి స్టేషన్‌లో కేసు పెట్టారు. ఇదిలాఉండగా మంగళవారం దీప కుటుంబ సభ్యులతో గోపలాయపల్లికి చేరుకొని గోపి ఇంటిముందు భర్త కావాలని టెంటు వేసి న్యాయ పోరాటం చేపట్టింది. దీంతో గోపి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించగా ఎస్‌ఐ విజయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలే కాని ఇలాంటి వాటికి పాల్పడకూడదని దీపకు నచ్చజెప్పారు. అయినా వినకపోడంతో చట్టాన్ని ఉల్లంగించినందున దీపపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

138
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...