తొలి విడుత నామినేషన్లకు ఒక్కరోజే..


Wed,April 24, 2019 02:13 AM

-దేవరకొండ డివిజన్‌లో రెండోరోజు 100నామినేషన్లు
- ఎంపీటీసీ స్థానాలకు -90, జడ్పీటీసీ స్థానాలకు -10 దాఖలు
డిండి మండలంలో అత్యధికంగా 20, నేరెడుగొమ్ములో అత్యల్పంగా 3
-చందంపేటలో నామినేషన్ల ప్రక్రియ పరిశీలించిన ఆర్డీఓ లింగ్యానాయక్
దేవరకొండ, నమస్తేతెలంగాణ : పరిషత్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో తొలివిడత ఎన్నికలు జరుగనున్న దేవరకొండ రెవెన్యూ డివిజన్‌లో రెండవ రోజైన మంగళవారం నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు కలిపి ఏకంగా 100 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 109ఎంపిటీసీ స్థానాలకుగాను 10మండలాల నుంచి 90నామినేషన్లు దాఖలయ్యాయి. 10జడ్పీటీసీ స్థానాలకు 10 నామినేషన్లు దాఖలయ్యాయి. 13ఎంపీటీసీ స్థానాలున్న డిండి మండలంలో రెండవ రోజు అత్యధికంగా 20 నామినేషన్లు దాఖలుకాగా..నేరడుగొమ్ము మండలంలో అత్యల్పంగా 3 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. టీఆర్‌ఎస్ తరపున 32మంది, కాంగ్రెస్ పార్టీ తరపున 23మంది, బీజేపీ తరపున ఏడుగురు, టీడీపీ నుంచి ముగ్గురు, సీపీఐ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్లుగా 23మంది నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 109 ఎంపీటీసీ స్థానాలకు రెండవ రోజు 89మంది అభ్యర్థులు మొత్తం 90నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల తొలిరోజు ఎంపీటీసీ స్థానాలకు 66నామినేషన్లు రాగా, రెండవ రోజు 90నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల దాఖలుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండడంతో బుధవారం పెద్ద ఎత్తున దాఖలయ్యే అవకాశం ఉంది. చందంపేట మండలంలోని పలు కేంద్రాల్లో దేవరకొండ ఆర్డీఓ గుగులోతు లింగ్యానాయక్ నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించారు.
జడ్పీటీసీ స్థానాలకు 10 నామినేషన్లు..
దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 జడ్పీటీసీ స్థానాలకు తొలిరోజు కేవలం 3 నామినేషన్లు దాఖలుకాగా రెండవ రోజు మంగళవారం 10నామినేషన్లు వచ్చాయి. చందంపేట మండలంలో టీఆర్‌ఎస్ తరపున ఒక్కరు, నేరడుగొమ్ము మండలంలో టీఆర్‌ఎస్ తరపున ఓ నామినేషన్ దాఖలు కాగా..జనసేన పార్టీ నుంచి ఓ నామినేషన్, ఇండిపెండెంట్ అభ్యర్థి మరో నామినేషన్ దాఖలు చేశారు. గుర్రంపో డు మండలంలో బీజేపీ నుంచి ఒకరు, మర్రిగూడ మండలంలో కాంగ్రెస్ నుంచి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. డిండి మండలంలో సీపీఐ నుంచి ఒకరు జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...