తొలిరోజు 69


Mon,April 22, 2019 11:49 PM

దేవరకొండ, నమస్తేతెలంగాణ: జిల్లాలో తొలివిడతలో దేవరకొండ రెవెన్యూ డివిజన్‌లో జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికలకు సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైం ది. డివిజన్ పరిధిలోని ఆయా మండలకేంద్రాల్లో జడ్పీటీసీ నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు స్వీకరించగా..ఎంపీటీసీల నామినేషన్లను ఆయా ప్రాదేశిక నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి స్వీకరించారు. మొత్తం 109 ఎంపీటీసీ స్థానాలకు గానూ 9 మండలాల నుంచి 66 నామినేషన్లు దాఖలయ్యాయి. 10 జడ్పీటీసీ స్థానాలకు కేవలం 3 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. 14 ఎంపిటీసీ స్థానాలు ఉన్న పిఏపల్లి మండలంలో తొలిరోజు అత్యధికంగా 18 నామినేష న్లు దాఖలుకాగా..నాంపల్లి మండలంలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. టీఆర్‌ఎస్ పార్టీ తరపున 23 మంది, కాంగ్రెస్ పార్టీ తరపున 34 మంది, బీజేపీ తరపున ఇద్దరు, టీడీపీ పార్టీ నుంచి ఒక్కరు, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 109 ఎంపీటీసీ స్థానాలకు గానూ తొలిరోజు 62 మంది అభ్యర్థులు మొత్తం 66 నామినేషన్లను దాఖలు చేశారు. ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను దేవరకొండ, కొండమల్లేపల్లి, నేరెడుగొమ్ము, డిండి మండలాల్లోని పలు కేంద్రాల్లో దేవరకొండ ఆర్డీఓ గుగులోతు లింగ్యానాయక్ పర్యవేక్షించారు.

జడ్పీటీసీ స్థానాలకు 3 నామినేషన్లు
దేవరకొండ డివిజన్ పరిధిలో 10 మండలాల్లో ఉన్న 10 జడ్పీటీసీ స్థానాలకు తొలిరోజు 3 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యా యి. దేవరకొండ జడ్పీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ పార్టీ తరపున మారుపాకుల అరుణ సురేష్‌గౌడ్ నామినేషన్ దాఖలు చేయగా, నేరడుగొమ్ము మండల జడ్పీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కేతావత్ బాలు, మర్రిగూడ జడ్పీటీసీ స్థానానికి బీజేపీ అభ్యర్థి పిక్కెళ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు.
దేవరకొండ డివిజన్‌లో ఎంపీటీసీ స్థానాలకు తొలిరోజు దాఖలైన నామినేషన్లు

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...