రేపటినుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు


Mon,April 22, 2019 11:48 PM

రామగిరి: ఓపెన్‌స్కూల్ ఇంటర్, పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అంతా సిద్ధ్దం చేసింది. పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 4,775 మం ది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరి కోసం 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష నిర్ణీత సమయం కంటే 5 నిమిషాలు ఆలస్యమైతే అనుమతించేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ఈనెల 24 నుంచి ఓపెన్‌స్కూల్ ఇంటర్ మీడియట్, పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నా యి. ప్రతి రోజు పరీక్షలు ఉదయం 8.30 నుంచి 11.30 వరకు జరుగుతాయి. ఇందుకు ప్రత్యేకమైన స్క్యాడ్ బృందాలు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

హాజరు కానున్న 4,775 మంది విద్యార్థులు
ఓపెన్ స్కూల్ పరీక్షలకు 4,775 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ఇంటర్ మీడియట్‌లో 2,862, పదో తరగతి లో 1913 మంది పరీక్షలు రాయనున్నారు. నల్లగొండలో 3, మిర్యాలగూడలో 4, దేవరకొండలో 3 ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్ మీడియట్ కోసం నల్లగొండలో 2, మిర్యాలగూడలో 2, దేవరకొండలో 1 పరీక్ష కేంద్రలు కేటాయించారు.

అభ్యర్థులు హాల్‌టికెట్, పరీక్ష ప్యాడ్, పెన్, పెన్సిల్ మాత్రమే తీసుకుని రావాలని జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఎం.మంగళ, డీఈఓ పి.సరోజినిదేవి వెల్లడించారు. అంతేగాకుండా పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు.

175
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...