5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం


Mon,April 22, 2019 11:48 PM

చిట్యాల : యాసంగి సీజన్‌లో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటివరకు 1,48,339 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసినట్లు ఇన్‌చార్జి డీఎస్‌ఓ రమేష్ తెలిపారు. సోమవారం చిట్యాలలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికిగానూ రైతులకు రూ.262 కోట్లు చెల్లించాల్సి ఉంద న్నారు. జిల్లాలో 288 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా అందులో 213 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నట్లు వివరించారు. ఆయనవెంట డిప్యూటీ తహసీల్దార్ ప్రాంక్లిన్, ఆర్‌ఐ ప్రభు తదితరులు ఉన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...