నేటి నుంచి తొలివిడుత నామినేషన్లు


Mon,April 22, 2019 02:18 AM

- ఈనెల 24 వరకు కొనసాగనున్న ప్రక్రియ
- దేవరకొండ రెవెన్యూ డివిజన్‌లో 10 ఎంపీపీ, 10 జడ్పీటీసీ, 109 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
- నేడు విడుదల కానున్న ఎన్నికల నోటిఫికేషన్
- బలమైన అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన పార్టీలు
దేవరకొండ, నమస్తేతెలంగాణ: జిల్లాలోని దేవరకొండ రెవె న్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న తొలివిడత ప్రాదేశిక సమరానికి సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. డివిజన్ పరిధిలోని దేవరకొండ, కొండ మల్లేపల్లి, డిండి, చం దంపేట, నేరడుగొ మ్ము, పీఏపల్లి, చింతపల్లి, గుర్రంపోడు, మర్రిగూడ, నాంపల్లి మండలాల పరిధిలో 10 ఎంపీపీ, 10 జడ్పీటీసీ, 109 ఎం పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని మం డల కేంద్రాల్లో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో నామినేషన్లను స్వీకరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గం టల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేష్లను స్వీకరించనున్నారు. 25న స్క్రూట్నీ, 27న ఫిర్యాదులు, 28న ఉపసంహరణ అనంతరం బరిలో నిలి చే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. కాగా తొలి విడత ఎన్నికలకు సోమవారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.

అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు
మే 6న జరగనున్న తొలి విడత ప్రాదేశిక ఎన్నికలకు ఎక్కువగా సమయం లేకపోవడం..నామినేషన్ల దాఖలుకు సైతం ఇంకా రెండు రోజులే మిగిలిఉన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. ఎం పీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందనే విషయమై పార్టీల్లో నేతలు అంతర్గతంగా ఇతరుల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. గతంలో గెలుపోటముల తీరు, ఎన్నిక ల్లో పోటీ చేసిన సందర్భాలు సహా ఇతరత్రా రాజకీయ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రత్యర్థికి పోటీనిచ్చే నేతల్ని సిద్ధ్దం చేసుకొని వారిచేత నామినేషన్ వేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయా స్థానాల వారీగా అందివచ్చిన రిజర్వేషన్లతో అన్ని పార్టీల్లో ఆశావాహుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా టీఆర్‌ఎస్‌లో ఈ పోటీ ఎక్కువగా ఉండడంతో అభ్యర్థుల ఎంపిక ఆపార్టీ నేతల కు పెనుసవాలుగా మా రింది. ముందస్తుగానే ఒక ఒప్పందం ప్రకా రం అభ్యర్థుల ఎంపికను పక్కాగా పూర్తి చేస్తేనే రెబల్స్ బెడద ఉండదనే ఉద్దేశంతో ఆయా పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. తీరా టికెట్లు ఖరారు చేసిన తర్వాత తిరుగుబాటు అభ్యర్థులుగా సొం త పార్టీవారే పోటీ చేస్తే ఇబ్బంది అనే విషయాన్ని ముందుగానే గుర్తించి నాయకులు అడుగులు వేస్తున్నారు.

ప్రాదేశిక ఎన్నికలపై టీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టి
గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కావడానికి ప్రాదేశిక ఎన్నికలు ఎంతగానో దోహద పడనున్నందున టీఆర్‌ఎస్ పార్టీ ప్రాదేశిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాదేశిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుచుకోవాలని.. అసెంబ్లీ, పంచాయతీ, లోక్‌సభ ఎన్నికల స్ఫూర్తిని కొనసాగించాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌లో ఇటీవల నిర్వహించిన సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు జిల్లాల వారిగా పార్టీపరంగా ఇన్‌చార్జిలను కూడా నియమించారు. ప్రధానంగా ఎమ్మెల్యేల పైనే ఎంపీటీసీ, జడ్పీటీసీల గెలుపు బాధ్యతలను మోపడంతో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ గత కొద్దిరోజులుగా కార్యకర్తలు, నేతల మధ్య సమన్వయం సాధిం చే దిశగా కృషి చేస్తున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ప్రాదేశిక ఎన్నికల్లో పునరావృతమయ్యేలా ఆయన వ్యూహాలు పన్నుతున్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...