సాగర్‌లో పర్యాటకుల సందడి


Mon,April 22, 2019 02:17 AM

నందికొండ : ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్‌లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. నాగార్జునకొండకు తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన లాంచీలో వెళ్లేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపారు. నాగార్జునకొండలో బుద్ధుడికి సంబంధించిన ఆర్కియాలజీ మ్యూజియంలో పొందుపరిచిన శిల్పాలు, మ్యూజియం వెలుపల గల యజ్ఞశాల, చైత్యాలు, సింహాల విహారంలో ఎత్తైన బుద్ధుడి విగ్రహం, అశ్వవేదయాగశాల, నేలపై అలనాడు ఇటుకలతో ఏర్పాటు చేసిన స్వస్తిక్ గుర్తు వాటితో పాటు నదిలోయ నాగరికతలకు సంబంధించిన చారిత్రాత్మక విశేషాలను తెలుసుకున్నారు. బుద్ధ్దవనం (శ్రీపర్వతారామం) లోని గోపురం పైన, మ్యూజియంలో అమర్చిన శిల్పాలను, స్తూపపార్కు, ధ్యానవనం, బుద్ధచరితవనం, మహాస్తూపపార్కు, మహాబుద్ధ్దస్తూపం ప్రాంతాలలో కూడా పర్యాటకుల సందడి నెలకొంది. తెలంగాణ టూరిజం నాగార్జునకొండకు 4ట్రిప్పులు లాంచీలను నడుపడంతో శని,ఆది వారాలలో రూ.40,000 ఆదాయం వచ్చినట్లు టూరిజం మేనేజర్ హరిబాబు తెలిపారు. పర్యాటకులతో లాంచీస్టేషన్ ప్రాంతం, డ్యాం పరిసరాలు, హోటళ్లు కిటకిట లాడాయి.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...