ఎడమ కాల్వకు నీటి విడుదల నిలిపివేత


Mon,April 22, 2019 02:17 AM

నందికొండ : నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీటి విడుదలను ఆదివారం ఎన్‌ఎస్‌పీ అధికారులు నిలు పుదల చేశారు. ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలోని రాజ వరం మేజర్ కింద ఉన్న భూముల్లో చివరిదశలో ఉన్న వరి చేనుకు నీరందించుటకు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఎడమ కాల్వకు శుక్రవారం నీటివిడుదలను ప్రారంభించి శనివారం రాత్రి వరకు కొనసాగించారు. రోజుకు 1000 క్యూసెకుల చొప్పున 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. నా గార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి యాసంగికి డిసెం బర్ 26 నుంచి వార బందీ పద్ధ్దతిలో నీటి విడుదల కొనసాగిస్తూ 7 విడుతలలో 35.57 టీఎంసీల నీటిని విడుదల చేశారు. కుడికాల్వ ద్వారా తాగు నీటికి నీటి విడుదల కొనసాగుతుందని ఎన్‌ఎస్‌పీ అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ రిజర్వా యర్ పూర్తి స్థాయి సామర్థ్యం 590 అడుగులకు గాను 512.70 అడుగుల వద్ద 136.3003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి కుడికాల్వ ద్వారా 6553 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, డీటీ గేట్ల (డైవర్షన్ టన్నల్) ద్వారా 10 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...