కస్తూర్బాలో ఉత్తమ ఫలితాలు


Mon,April 22, 2019 02:17 AM

-జూనియర్ ఇంటర్‌లో 53.57 శాతం ఉత్తీర్ణత
-స్థాపించిన తొలి సంవత్సరంలోనే సక్సెస్
-ఫెయిలైన వారికి నేటి నుంచి ప్రత్యేక తరగతులు
రామగిరి: జిల్లాలో 27 కస్తూర్బా విద్యాలయాలు ఉన్నా యి. వీటిలో చాల విద్యార్థునులు పేద(తల్లిదండ్రులేని), బడి బయట, అనాథ, గ్రామీణ విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా 2018-19 సంవత్సరంలో జిల్లాలోని వేములపల్లి, తిప్పర్తి, కేతేపల్లి, అనుముల, మునుగోడు, దేవరకొండ కస్తూర్బాల్లో ఇంటర్‌మీడియట్ ప్రథమ సంవత్సరం అమలు చేశారు. ఈనెల 18న విడుదలైన ఫలితాల్లో జిల్లాస్థాయిలోనే ఉత్తమ ఫలితాలతో ఆణిముత్యాలుగా మెరిశారు.
తొలి ఏడాదిలోనే మెరుగైన ఫలితాలు....
జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా పాఠశాలల్లో ఆరింట్లోనే 2018-19లో ప్రభుత్వం ఇంటర్‌మీడియట్ ప్రథమ సం వత్సరాన్ని ప్రారంభించింది. అయితే ఈ అడ్మిషన్ల ప్రకియ జులై చివరినాటికి ముగిసింది. పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే వీటిలో చేరార ని అయినప్పటికి వారిని తీర్చిదిద్ది స్థాపించిన తొలి ఏడాదిలోనే మెరుగైన ఫలితాలు సాధించాయి. వీరి అభివృద్ధి కోసం సిలబస్‌ను పూర్తయిన తర్వాత ప్రజ్ఞ పేరుతో ప్రత్యేక తరగతులను నిర్వహించారు. సాధారణ విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత ఈ విద్యా సంస్థలకే దక్కుతుంది.
ఫెయిలైన వారిపై ప్రత్యేక శ్రద్ధ
ఇంటర్ మీడియట్‌లో ఫెయిలైన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో ఇంటర్ కోర్సుల్లో ఫెయిలైన విద్యార్థులందరికీ అనుములలోని కసూర్బా పాఠశాలలో ఈనెల 22 నుంచి ప్రత్యేక తరగతులను ప్రారంభిస్తున్నారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు అయిపోయేంత వరకు ఆయా సబ్జెక్టుల్లో నిపుణులచే ప్రత్యేక శిక్షణ నిప్పించి నిరంతరం సాధన చేయించేలా ప్రణాళికలు తయారు చేశారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో వంద శాతం ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకుంటుండటం విశేషం.
53.57 శాతం మంది ఉత్తీర్ణత ..
జిల్లాలోని ఆరు కస్తూర్బాల్లో ఇంటర్ ప్రథమ సం. పరీక్షల కు 314 మంది విద్యార్థినులు హాజరయ్యారు. వీరిలో 168మంది ఉత్తీర్ణత సాధించడంతో 53.57శాతం ఫలితా లు వచ్చాయి. మునుగోడు, కేతేపల్లి పాఠశాలల్లో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు మాత్రమే ఉన్నాయి. అదే విధంగా అనుముల, తిప్పర్తి , దేవరకొండ, వేములపల్లి పాఠశాలల్లో ఎంపీసీ, బైపీసీలు మాత్రమే ఉన్నాయి.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...