పేద విద్యార్థుల అభ్యున్నతికే ఉద్దీపన


Mon,April 22, 2019 02:16 AM

-మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
-వలంటీర్లకు గౌరవవేతనం అందజేత
నకిరేకల్ , నమస్తే తెలంగాణ : పేద విద్యార్థుల అభ్యన్నతి కోసమే ఉద్దీపన ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు ఉద్దీపన చైర్మన్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఆదివారం నకిరేకల్ పట్టణంలోని ఎంఎంరెడ్డి ఫంక్షన్ హాల్లో ఉద్దీపన భవిష్యత్ కార్యచరణ ప్రణాళికపై ఉపాధ్యాయులు, వలంటీర్లతో ఆయన చర్చించి, వలంటీర్లకు గౌరవ వేతనం అందజేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు మంచి మార్కులు సాధించినా ఇంగ్లీష్‌లో నైపు ణ్యం లేక ఉన్నత స్థానానికి ఎదగలేకపోవుతున్నారని, అలాంటి విద్యార్థులకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్దీపన కార్యక్రమ అమలుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అత్యుత్తమ ఇంగ్లీష్ బోధనకు సమర్థులైన వలంటీర్లను నియమించి ఆహ్లాదకర వాతావరణంలో బోధన అందిస్తున్నట్లు చెప్పారు. 150 పాఠశాలల్లో 160మంది వలంటీర్లను నియమించామని ఇందుకు ఏడాదికిరూ. కోటి 20 లక్షలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. వీరేశం పదవి ఉన్నంత వరకే ఉద్దీపన కొనసాగిస్తారని కొందరు అన్నారని... జీవితంలో పదవులు శాశ్వ తం కాదని తాను ఉన్నంత వరకు ఎంత కష్టమైనా ఉద్దీపన కార్యక్రమాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు.

భవిష్యత్‌లో విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులతో ఉద్దీపన కోర్‌కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్దీపనను ప్రారంభించి మూడేళ్లు పూర్తి కావస్తుందని, కార్యక్రమం అమలు తరువాత ప్రైవేటు పాఠశాలలో విద్యార్థు లు తగ్గుముఖం పట్టి ప్రభుత్వ పాఠశాలల బాటపట్టారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య, ఎన్‌ఐఆర్డీ అసోసియే ట్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్, డైట్ కళాశా ల బోధకుడు మంగారెడ్డి, సీనియర్ విద్యా కార్యకర్త కృష్ణారెడ్డి, నకిరేకల్ జడ్పీటీసీ పెండెం ధనలక్ష్మిసదానందం, కేతేపల్లి ఎం పీపీ గుత్తా మంజులామాధవరెడ్డి, నకిరేకల్ వైస్ ఎంపీపీ సామ బాలమ్మ, ఎంఈఓలు గోలి చంద్రశేఖర్‌రెడ్డి, నాగయ్య, రా జన్న, ఉద్దీపన కో ఆర్డినేటర్ సతీష్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వలంటీర్లు, నాయకులు పాల్గొన్నారు.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...