టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి


Mon,April 22, 2019 02:16 AM

-ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
త్రిపురారం : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ కోరారు. మండలకేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాదేశిక నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ జయకేతనం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే నిలిచారని, ఎంపీ ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాలు పునరావృతమవుతాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనపై నమ్మకంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలాంటి నాయకులను ప్రజలు ఇంటికే పరిమితం చేశారన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. సాగుకు 24గంటల విద్యుత్, రైతు రుణమాఫీ, పెట్టుబడి సాయం, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్టు, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణం దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.

రైతుల ఇబ్బందులను తీర్చేందుకే రెవెన్యూశాఖ ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ నడుం బిగించారని చెప్పారు. మంత్రి జగదీష్‌రెడ్డి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎంపీ ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పరాభవం తప్పదన్నారు. 50ఏండ్ల చరిత్రలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎడమకాల్వ ద్వారా రాజవరం మేజర్‌కు సాగునీరు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుతాదేనని గుర్తు చేశారు. సమావేశంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు రవీందర్‌రావు, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్, సర్పంచ్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి, మర్ల చంద్రారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ అనుముల అనంతరెడ్డి, పడిశల బుచ్చయ్య, ధన్‌సింగ్‌నాయ క్, జంగిలి శ్రీనివాస్‌యాదవ్, బచ్చు సాంబయ్య, అనుముల అన్నపూర్ణమ్మ, టీఆర్‌ఎస్ మహిళావిభాగం మం డలాధ్యక్షురాలు పులిజాల జ్యోతి పాల్గొన్నారు.

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...