ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి


Mon,April 22, 2019 02:16 AM

- జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి
దేవరకొండ, నమస్తేతెలంగాణ : తొలి విడతలో దేవరకొండ రెవెన్యూ డివిజన్‌లో జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీసీఈ ఓ వీరబ్రహ్మచారి అన్నారు. ఆదివారం దేవరకొండ ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై అధికారులతో ఆయన సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం బ్యాలెట్ బాక్సులు భద్రపరిచేందుకు స్థానిక మోడల్ స్కూల్, ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను ఆయన పరిశీలించారు. డివిజన్ పరిధిలోని 10మండలాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను మోడల్ స్కూల్, ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలోనే ఏర్పాటు చేయడంతో కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట దేవరకొండ ఎంపీడీఓ పాండు తదతరులున్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...