పరిషత్ ఎన్నికలకు మోగిన నగారా...


Sun,April 21, 2019 12:08 AM

- జిల్లాలో మూడు విడుతలుగా ప్రాదేశిక ఎన్నికలు
- దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండలో వరుసగా
- ఈ నెల 22,26,30న నోటిఫికేషన్లు, మే 6,10,14న పోలింగ్
- జిల్లాలో 31జడ్పీటీసీ, 349ఎంపీటీసీ స్థానాలు
- ఓటు హక్కు వినియోగించుకోనున్న 9,67,912మంది ఓటర్లు

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికల హడాహుడి ముగియగానే పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసి షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 31జడ్పీటీసీ, 349ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, ఓటర్ల జాబితా సైతం గతనెల 25న ఫైనల్ అయ్యింది. అయితే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈనెల 8న ముసాయిదా సిద్ధ్దం కాగా, శనివారం డ్రాప్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో లైన్ క్లీయరైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసి నోటిఫికేషన్, పోలింగ్ తేదీలను ప్రకటించనుంది. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో మూడు విడుతలుగా ఎన్నికలు జరుగనుండగా ఈనెలలో నోటిఫికేషన్లు, వచ్చే నెలలో పోలింగ్ జరుగనుంది.

నోటిఫికేషన్.. పోలింగ్ ఇలా...
జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లు ఉండగా మూడు విడుతలుగా పరిషత్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 22న దేవరకొండ రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఆరోజు నుంచి 24సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 25న స్క్రూట్నీ, 26న అప్పిల్, 27న తిరస్కరణ, 28న ఉపసంహరణ జరుగనుంది. ఆతర్వాత ఈ డివిజన్‌లో వచ్చేనెల 6న ఎన్నికలు జరుగనున్నాయి. మలివిడుత నోటిఫికేషన్ 26న మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి విడుదల కానుండగా ఆరోజు నుంచి 28వరకు నామినేషన్ల స్వీకరణ, 29న స్క్రూట్నీ, 30న అప్పిల్, మే1న తిరస్కరణ, 2న ఉపసంహరణ జరుగనుంది. ఈ డివిజన్‌లో10న ఎన్నికలు జరుగుతాయి. ఇక తుది విడుతగా ఈనెల 30న నోటిఫికేషన్ విడుదల కానుండగా మే2వరకు నామినేషన్లు, 3న స్క్రూట్నీ, 4న అప్పీల్, 5న తిరస్కరణ, 6న ఉపసంహరణ అనంతరం 14న ఎన్నికలు, 27న ఫలితాలు వెలువడనున్నాయి.

ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి...
జిల్లాలోని పరిషత్ ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెలలో నోటిఫికేషన్లు, వచ్చే ఎన్నికలు జరుగనున్నాయి. 31మండలాల్లో 9,67,912మంది ఓటు హక్కు వినియోగించుకోనుండగా అందుకు 1930పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అందులో 305పోలింగ్ కేంద్రాల్లో 400ల లోపు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, 1625కేంద్రాల పరిధిలో 400 నుంచి 600 వరకు ఓటర్లు ఉన్నారు. అయితే ఆయా డివిజన్లలో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు 4626మంది ప్రిసైడింగ్ అధికారులు, 8887మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు విధుల్లో పాల్గొననున్నారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరుగనుండగా ఎంపీటీసీ, జడ్పీటీసీలకు వేర్వేరు బ్యాలెట్లలో ఓట్లు వేయాల్సి ఉం టుంది. ఇందుకు 1959 పెద్ద బ్యాలెట్ బాక్స్‌లు, 1585 మధ్యస్థ బ్యాలెట్ బాక్స్‌లు, 675 చిన్న బ్యాలెట్ బాక్స్‌లు సమకూర్చి పెట్టారు.

137
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...