ఉరుములు.. మెరుపులు


Sun,April 21, 2019 12:07 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: ఆల్పపీడన ద్రో ణి ప్రభావంతో జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షం అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పొద్దుందాక భానుడి భగ భగలు.. సా యంత్రం వరణుడి జల్లులు.. గడిచిన నాలుగు రోజులుగా జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి. శనివారం జిల్లా కేంద్రంలో సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిని మోస్తరు వర్షం కురిసింది. నా లుగు రోజులు గా వర్షాల కారణంగా ధాన్యం త డవడంతో ఆరబెట్టుకోవడానికి ఉదయం నేర్పుతున్న రైతులు సాయంత్రం మళ్లీ వర్షం పడడంతో కుప్ప నూర్చుతున్నారు.

దామరచర్లలో దంచి కొట్టిన వాన..
దామరచర్ల: దామరచర్లలో శనివారం భారీ వర్షం కురిసింది. గంట సేపు గాలితో కూడిన వాన కురవడంతో మండలకేంద్రంలోని సబ్‌మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోయి వరదలకు కొట్టుకొని పోయింది. కొన్ని వరికుప్పలు నీటికుంటల్లో మునిగిపోయాయి. కొద్దిసేపు వడగండ్లు కూడా పడ్డాయి. కొనుగోలు కేంద్రంలో కాంటా వేసిన బస్తాలను ఎప్పటికప్పుడు ఎగుమతి చేయడంతో కొంత ఊపిరి పీల్చుకొన్నారు. రైతులు అధికంగా ధాన్యాన్ని కేంద్రానికి తీసుకొచ్చి మ్యా చుర్ కోసం ఆరబెట్టడంతో వర్షాలకు నష్టపోతున్నారు.

నిమ్మ రైతులకు భారీ నష్టం
మునుగోడు : మండలంలోని కోతులారం, చీకటిమామిడి, వెల్మకన్నె గ్రామాల్లో శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఇండ్ల పై కప్పులతో పాటు నిమ్మ కాయలు నేలపాలయ్యాయి. దీంతో రైతులు భారీగా నష్టపోవడంతో ఉద్యానవన విస్తరణ అధికారి ఎల్లయ్య చీకటిమామిడిలో నిమ్మతోట రైతులు పరందాములు, వెంకటేశ్వర్లు, శ్రీరాములు పంటలను పరిశీలించారు. నష్టం అంచనా వేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తానన్నారు.

కూలిన ఇంటిపై కప్పు
కొండమల్లేపల్లి : మండలంలోనిగుడితండాలో శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు వాంకుడావత్ పాండు ఇంటి శ్లాబ్ కూలింది. ఉదయమే తమ కుమారుల వద్దకు హైదరాబాద్‌కు వెళ్ల డంతో వారికి ప్రాణా పాయం తప్పినైట్లెంది.తండాలో సుమారు 20 ఇళ్లు పెచ్చులు ఊడిఉండటంతో ఆయా గృహాల్లో నివాసం ఉంటున్న వారు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

శాలిగౌరారంలో తడిసిన ధాన్యం
శాలిగౌరారం: అకాల వర్షంతో ఆయకట్టులో వరి చేన్లు తడిసి ముద్దయ్యాయి. మండలంలోని గురజాల, తుడిమిడి, చిత్తలూరు, వంగమర్తి, శాలిగౌరారం, ఎన్జీకొత్తపెల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వ ర్షం పడింది. అలాగే మండలంలోని ఐకేపీ కేంద్రా ల్లో, శాలిగౌరారం మార్కెట్ యా ర్డ్‌లో అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. కొంత ధాన్యం సైతం కొట్టుకు పోయింది. మా మి డి, నిమ్మతోటలు ధ్వంసం కావడంతో మామిడి, నిమ్మకాయలు నేలరాలాయి. దీంతో మం డ లంలో తీవ్రంగా రైతులు నష్ట పోయారు.

కేతేపల్లిలో..
కేతేపల్లి : మండలంలోని శనివారం తెల్లవారుజామున ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.ఈ వర్షం తాకిడికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు వర్షంలో తడిసి ముద్దయ్యాయి. వర్షానికి తడిసిన ధాన్యం రాశుల చుట్టూ కాలువలు తీస్తూ, టార్పాలిన్‌ల కప్పుకున్నారు.అంతే కాకుండా కొత్తపేట, కాసనగోడు, బొప్పారం, కొర్లపహాడ్, చెర్కుపల్లి, తుంగుతుర్తి, భీమారం, కొప్పోలు గ్రామాల్లో కోత దశకు వచ్చిన వరిపొలంలో నిండా నీళ్లు నిలిచి ఈ దురుగాలుల బీభత్సానికి ధాన్యగింజలు రాలిపోయాయి.కోత దశలో వరి నేలకొరడం, గింజలు రాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అడవిదేవులపల్లిలో మోస్తరు వర్షం
అడవిదేవులపల్లి: మండల వ్యాప్తంగా గురువారం సాయ ంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.మండలంలోని వివిద గ్రామాల్లో కోత దశల్లో ఉన్న వరి ఈ వర్షానికి నేలకొరిగింది.మండల వ్యాప్తంగా 80 శాతానికి పైగా వరి పొలాలు కోతకు రావడంతో ఈ వర్షం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం కాగా తడిసి పోయింది.

196
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...