జై వీర హనుమాన్


Sat,April 20, 2019 12:04 AM

నల్లగొండకల్చరల్ : హనుమాన్ జయంతి వేడుకలను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం ఆంజనేయస్వామి శోభాయాత్ర నిర్వహించగా.. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం హనుమాన్‌జయంతిని ఘనంగా నిర్వహించారు. భజరంగ్‌దళ్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభాయాత్రలు, బైక్‌ర్యాలీలు నిర్వహించారు. అందులో భాగంగా జిల్లా కేంద్రంలో భజరంగ్‌దళ్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీర హనుమాన్ విజయయాత్ర శోభాయామానంగా సాగింది. అంతకు ముందు నల్లగొండలోని పాతబస్తీ హనుమాన్ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి యాత్రను శుక్రవారం సాయంత్రం భజరంగ్‌దళ్ రాష్ట్ర కోకన్వీనర్ శివరాములు ప్రారంభించారు. ఈ యాత్ర పాతబస్తీ, డీఈఓ కార్యాలయం, ప్రకాశంబజార్, గడియారం సెంటర్ మీదుగా రామగిరి, శివాజీనగర్, ఎన్టీఆర్ విగ్రహం, హైదరాబాద్ రోడ్డు మీదుగా వీటీకాలనీ హనుమాన్ ఆలయం వరకు సాగింది. ముఖ్య వక్తగా ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ ప్రచారక్ నారా వెంకట శివకుమార్ హాజరై మాట్లాడారు. నమ్మకానికి నిలువెత్తు నిర్వచనంగా హనుమాన్‌ను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయన్నారు. నేటి సమాజంలో గోవధను నివారించి రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గోరక్షణకై శ్రీకారం చుట్టాలని అన్ని దేవాలయాల్లో గోశాలలు ఏర్పాటు చేసి గోవులను పూజించాలని కోరారు. యాత్రలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, జిల్లా కార్యదర్శి నేవర్సు అభిలాష్, ఉపాధ్యక్షులు పర్వతం అశోక్, నార్ల వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సహాయ కార్యదర్శి సంపత్‌వర్మ, విభాగ్ సంఘటన కార్యదర్శి కన్నెబోయిన వెంకట్, వెలిజాల నర్సింహ, బుర్రి వేణు, కళ్యాణ్, భజరంగదళ్ ప్రముఖ్ పెద్దబోయిన రవి, విద్యార్థి ప్రముఖ్ నాగార్జున, గోరక్షక ప్రముఖ్‌స్వామి, హరి, భాస్కర్, శ్రీనివాస్, క్రాంతికుమార్ పాల్గొన్నారు. వీటీ కాలనీలోని పంచముఖ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, అదే విధంగా దేవరకొండలో నిర్వహించిన హనుమాన్ జయంతిలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

141
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...