భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే


Sat,April 20, 2019 12:03 AM

నల్లగొండకల్చరల్: ఏస్తుక్రీస్తు శిలువ వేయబడిన రోజైన గుడ్‌ప్రైడే వేడుకలను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు భక్తి శ్రద్ధ్దలతో జరుపుకున్నారు. దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలోని పలు చర్చిలలో కరుణామయుడైన ఏస్తుక్రీస్తు నామస్మరణతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తూప్రభువు చూపిన ప్రేమ, శాంతి, కరుణ సమాధానం ప్రపంచంతోపాటు ప్రజలందరిలో జీవించాలని ఒకరినొకరు సహాయ, సహకారాలు అందించుకోవాలని ప్రార్థించారు.

మరియరాణి కొండ చర్చిలో... జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో గల మరియరాణి గుట్టపైగల చర్చిలో ఏస్తుక్రీస్తును శిలువ వేసిన సన్నివేశా న్ని కళ్లకు కట్టినట్లు చూపారు. ప్ర భువు ఆనాడు అనుభవించిన క ష్టాలను నాటక రూపంలో ప్రదర్శించారు. శిలువ ప్రదర్శనను మరియ కెథడ్రిల్ చర్చి నుంచి మరియకొండపై గల చర్చి వరకు సాగిన వేడుకలో అత్యధికంగా క్రైస్తవులు పాల్గొన్నారు. క్రీస్తు మానవులకోసం పడిన బాధలు, శిలువ వేయబడిన తీరు సన్నివేశాన్ని చూసిన ప్రార్థనలకు హాజరైన మహిళలు, యువతీ, యువకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గుడ్‌ఫ్రైడే వేడుకల్లో క్రైస్తవ భక్తులు, ఫాదర్స్ బిషప్ గోవింద్‌జోజి, క్రైస్తవ పెద్ద పసల శౌరయ్య, పాదర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు. తెలుగు బాప్టిస్టు చర్చిలో సంఘ కాపరి డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు క్రిష్టోఫర్, ఉపాధ్యక్షులు ఐ.మాణిక్యం, కార్యదర్శి అప్సలోహం, కోశాధికారి కృపానందం, ప్రసాద్, ప్రాజెక్టు కన్వీనర్ టీఎస్. విలియమ్స్, మత్స్యగిరి పాల్గొన్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...