మూడో రోజూ వర్షం


Sat,April 20, 2019 12:03 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మూడో రోజు వర్షం కురిసింది. ద్రోణి ప్రభావం కారణంగా సాయంత్రం సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని మబ్బులు పట్టి వర్షం పడుతోంది. జిల్లా కేంద్రంలో సాయంత్రం సమయంలో జల్లులతో ప్రారంభమై మోస్తరు వర్షం పడింది. ఇక కనగల్, తిప్పర్తి మండలాల్లో స్వల్పంగా చిరు జల్లులు పడగా హాలియా, దేవరకొండలో మోస్తరు వర్షం పడింది. ఉదయం పూట ఎండ తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికి సాయంత్రం కురిసేటువంటి వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. అయితే ఈ అకాల వర్షాలు మాత్రం అన్నదాతను ఇబ్బంది పెడుతున్నాయి. మూడ్రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వరిచేను కోయడానికి అనుకూల పరిస్థితి లేదు. తడిచిన ధాన్యం ఆరబెట్టడానికి కూడా ఇబ్బందులు నెలకొన్నాయి.

పిడుగుపాటుకు ఆవు, కొడె మృతి
హాలియా, నమస్తేతెలంగాణ: అనుముల మండలంలో శుక్రవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పాలెం గ్రామానికి చెందిన మామిడి చినవెంకన్నకు చెందిన ఆవు, కోడెను ఇంటిముందు చెట్టుకు కటివేయగా, రాత్రి పిడుగుపాటుకు మృతి చెందాయి. సుమారు రూ.80 వేల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు.

139
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...