అమ్మవారికి ఊంజల్‌సేవ!!


Sat,April 20, 2019 12:03 AM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శ్రీలక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమపవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే ఊంజల్ సేవలో వేలాది మంది భక్తులు పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త... తనను కొలిచిన వారికి నేనున్నానంటూ అభయ హస్తమిచ్చి కాపాడే శ్రీలక్ష్మీ అమ్మవారికి విశేష పుష్పాలతో అలంకారం జరిపారు. బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా 516 రూపాయల టిక్కెట్ తీసుకున్న భక్తులకు సువర్ణపుష్పార్చన జరిపించారు. ఉపప్రధానార్చకులు బట్టర్ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం వైభవంగా నిర్వహించారు. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్థుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మంటపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంటపాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది. అష్టోత్తర పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆర్జిత పూజలు...
యాదాద్రిలో ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. అన్ని విభాగాల నుంచి రూ.9,77,592 ఆదాయం సమకూరినట్టు ఆలయాధికారులు తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి హైదరాబాద్‌కి చెందిన యరమాద భాగ్యలక్ష్మీరాంరెడ్డి దంపతులు బంగారు పుష్పాలను విరాళంగా అందజేశారు.

150
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...