బాలికలదే పైచేయి


Fri,April 19, 2019 02:37 AM

- ఇంటర్ ఫలితాల్లో జిల్లాకు 20వ స్థానం
- ప్రథమ సంవత్సరంలో 44, ద్వితీయలో 51శాతం
- గత సంవత్సరం కంటే పడిపోయిన ఉత్తీర్ణత శాతం
- ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ముందంజ

రామగిరి: ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. గురువారం ప్రభుత్వం విడుదల చేసిన ఫలితా ల్లో ఇంటర్ ప్రథమలో 44శాతం, ద్వితీయ సంవత్సరంలో 51శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లా 20వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరంతో పోలిస్తే ఉత్తీర్ణత శాతం గణనీయంగా తగ్గింది. అయితే ఈ సంవత్సరం బాలుర కంటే బాలికలే ఉత్తీర్ణతా శాతంలో పైచేయి సాధించారు. సీనియర్ ఇంటర్ బాలికలు 57 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 44శాతం, ప్రథమ సంత్సరంలో 50శాతం బాలికల ఉత్తీర్ణత ఉండగా బాలురది 37శాతంగా ఉంది. ఎంపీసీ విభాగంలో కేతేపల్లి మండలం తుంగతుర్తికి చెందిన దినేష్‌రెడ్డి 992 మార్కులతో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలవగా.. జిల్లా విద్యార్థిని నేతి యశ్వస్విని 989 మార్కులు సాధించ డంతో కొంత ఉపశమనంగా ఉన్నాయి. అయితే ఫలితాలు అసంతృప్తిని కలిగించాయని ఇంటర్‌మీడియట్ విద్యాశాఖ అధికారి హనుమంతరావు వెల్లడించారు.

ఇంటర్‌మీడియట్ ఫలితాలు విడుదలకావడంతో రాష్ట్రంలో జిల్లా 20వ స్థానానికి పడిపోయింది. ప్రథ మ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఒకే రోజు విడుదలైనప్పటికి రెండింటిలోనూ ప్రైవేటు విద్యార్థులే సత్తా చాటగా ప్రభుత్వ కళాశాలలో సైతం మెరుగైన ఫలితా లు వచ్చినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఫలితాల్లో బాలికల ముందంజ....
ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియేట్ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ముందంజలోనిలిచారు. కాగా ద్వితీయ పరీక్షలలో 3,995మంది బాలికలు ఉత్తీర్ణత సాధించి 57శాతం, 2,783మంది బాలురు ఉత్తీర్ణత సాధించి 44శాతం ఫలితాలు సాధించారు. అదేవిధం గా జూనియర్ ఇంటర్మీడియేట్‌ల్లో 3,630 బాలికలు ఉత్తీర్ణత సాధించి 50శాతం, బాలరు 2,376మంది ఉత్తీర్ణత సాధించి 37శాతం ఫలితాలు సాధించారు. మొత్తంగా బాలికలే పైచేయిగా ఉండటం విశేషం.

ఫలితాలు ఇలా...
ఇంటర్‌మీడియట్ ప్రథమ సం.పరీక్షలకు జిల్లా వ్యాప్తం గా 13,625 విద్యార్థులు హాజరు కాగా 6006 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా 44శాతం రాగా రాష్ట్ర స్థాయిలో 20వ స్థానం దక్కింది. అయితే గత సంవత్సరం ప్రథమ సంవత్సరంలో 51శాతం ఫలితాలు రాగా రాష్ట్రస్థాయిలో 15వ స్థానం దక్కింది. గతంతో పోలిస్తే 7 శాతం ఫలితాలు తగ్గడంతో తిరోగమనంగా ఫలితాలున్నాయి.

ఇంటర్‌మీడియట్ ద్వితీయ సం.పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 13,176 మంది హాజరు కాగా 6778 మం ది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా 51శాతం ఫలితాలు రాగా రాష్ట్రస్థాయిలో 20వ స్థానం దక్కింది. అయితే గత సంవత్సరం ద్వితీయ సం.లో 66శాతం ఫలితాలు రాగా రాష్ట్రస్థాయిలో 6వ స్థానం దక్కింది. గతంతో పోలిస్తే 15 శాతం ఫలితాలు దక్కగా ర్యాంకులు సైతం పూర్తిగా జిల్లా దిగజారింది.

మార్కుల్లో ఊరట కలిగించిన వైనం....
ఇంటర్‌మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా శాతం రంగా పడిపోయినప్పటికీ అత్యదికమైన ర్కులు జిల్లా విద్యార్థులకు రావడంతో ఊరటకలిగించింది. నల్లగొండలోని ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థిని ఎంపీసీ విభాగంలో నేతి యశస్విని 989/ 1000, సన్నగిరి నిశాంత్ 988/1000, గౌతమి కాలేజికి చెందిన కె.ఈశ్వర్‌దత్, ఎ. సాయికుమార్ ఎంపీసీలో 988, వై.మమత 987 మార్కులు సాధించి ఇటు జిల్లా, అటు రాష్ట్రస్థాయిలో కొంత ఉపశమనం కలిగించారు. అదేవిధంగా ప్రథమ సంవత్సరం ఫలితాల్లో సైతం బైపీసీ విభాగంలో గౌతమికి చెందిన పి.లక్ష్మీదుర్గ 434/440, ప్రగతికి చెందిన ఎ.పవిత్ర 431/440 మార్కులు, ఎంపీసీలో కోలా పురందర్, సీహెచ్. హారి క, పి.దివ్య, ఎ.సాయిచందన 462/470లు సాధించారు. అదేవిధంగా ఆల్పా కళాశాలకు చెం దిన కొన తం మనోజ్‌కుమార్ సీఈసీ ప్రథమసం.లో 475/ 500 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్ తెలిపారు. అదేవిధంగా నల్లగొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని బొల్లం శ్వేత 959/1000, సీఈ సీ విభాగంలో దుస్సా రమ్య 958/1000 మార్కులు సాధించి జిల్లాలోని ప్రభుత్వ కళాశాల కీర్తి చాటారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ మందడి నర్సిరెడ్డి వెల్లడించారు.

ఇంటర్ ఫలితాల్లో తుంగతుర్తి వాసికి టాప్‌మార్కులు
కేతేపల్లి: విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కేతేపల్లి మండలానికి చెందిన సూదిరెడ్డి దినేష్‌రెడ్డి రాష్ట్రస్థాయిలో టాప్‌మార్కులు సాధించాడు. దినేష్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌లోని నారాయణ కళాశాలలో డే స్కాలర్‌గా విద్యను కొనసాగించాడు. దినేష్‌రెడ్డి ఎంపీసీ విభాగంలో మొత్తం 1000 మార్కులకు గానూ 992 మార్కులు సాధించాడు. దినేష్‌రెడ్డి తండ్రి శేఖర్‌రెడ్డి యూసుఫ్‌గూడలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ తన కుమారుడిని చదివించాడు. తుంగతుర్తిలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన శేఖర్‌రెడ్డి కష్టపడి చదివి పోలీస్ ఉద్యోగం సంపాదించాడు. తన కుమారుడు కూడా తనకన్నా ప్రయోజకుడు కావాలనే ఉద్దేశంతో దినేష్‌రెడ్డిని చదివించాడు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదివిన దినేష్‌రెడ్డి రాష్ట్రస్థాయిలో టాప్‌మార్కులు సాధించాడు. దీంతో స్వగ్రామమైన తుంగతుర్తిలో శేఖర్‌రెడ్డి తల్లిందండ్రులు, కుటుంబసభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఐఏఎస్ సాధనే దినేష్ లక్ష్యం: శేఖర్‌రెడ్డి
దినేష్‌రెడ్డి రాష్ట్రస్థాయిలో టాప్‌మార్కులు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని అతడి తండ్రి శేఖర్‌రెడ్డి ఫోన్‌లో తెలిపారు. పేదరికం నుంచి వచ్చిన మా కుమారుడు ఐఐటీలో మంచి ర్యాంకును పొంది సివిల్స్ సాధించాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. సివిల్స్ సాధించడం ద్వారా పేదరికంలో ఉన్న ప్రజలకు సేవచేయడం సాధ్యపడుతుందన్నారు.

150
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...