మండు వేసవిలోనూ.... నిండుకుండలా


Fri,April 19, 2019 02:36 AM

హాలియా, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌కాకతీయ పథకం సత్ఫలితాలిస్తుంది. వలస సీమా్రంధ పాలనలో పూర్తిగా ధ్వంసమైన వందలా ది చెరువులకు టీఆర్‌ఎస్ ఐదేండ్ల పాలనలో మహర్ధశ పట్టింది. మిషన్ కాకతీయ పథ కం ద్వారా నాగార్జునసాగర్ ఆయకట్టు, నాన్ ఆయకట్టు మండలాల పరిధిలోని పలు చెరువులు, గొలుసుకట్టు చెరువులు, కుంటలను మిషన్ కాకతీయ పథకం ద్వారా సుమారు రూ.200కోట్ల వ్యయంతో చెరువు పునరుద్దరణ పనులు చేపట్టారు. చెరువుల్లో మట్టి పూడికతీత, కత్వల పటిష్టం, కంపతొలగింపు, తూముల పటిష్టం, కట్టల పటిష్టం, మైనర్ కాల్వల మరమ్మతుల వంటి పనులను చేపట్టారు. దాని ఫలితంగా వర్షాల కారణంగా, సాగర్ ఎడమకాల్వ ద్వారా నీటితో నిండిన చెరువులు మండు వేసవిలో సైతం నీటితో తొలనికీసలాడుతున్నాయి. అనుముల, తిరుమలగిరి(సాగర్), నిడమనూరు, త్రిపురారం పెద్దవూర, ఆయకట్టు, నాన్ ఆయకట్టు చెరువుల్లో జలకళ ఉట్టిపడుతుంది. మండువేసవిలోనూ చెరువుల్లన్నింటీల్లో నీరు నిండుకుండలా తలపిస్తున్నాయి. ప్రతిఏటా మే వచ్చిందంటే గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చే ది. గ్రామాల్లోని చెరువులు, కుంటలు, వాగులు, బావులు, చేతిపంపులు, స్కీంబోర్లు పూర్తిగా ఒట్టిపోయి జనం తాగునీటి కోసం అల్లాడేవారు. గుక్కెడు నీటి కోసం బిందెను నెత్తిన పెట్టుకోని మైళ్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. చెరువుల్లో సైతం చుక్క నీరు లేకుండా ఎండిపోయి చెరువుల అడుగుభాగం నెర్రలుబారాయి. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండాపోయింది. ఒకప్పుడు వేసవి వచ్చిందంటే గ్రామాల్లో జనం తాగునీటి కోసం పగలు, రాత్రి చేతిపంపుల వద్ద, వీది నల్లాల వద్ద పడిగాపులు కాసేవారు. టీఆర్‌ఎస్ ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క గ్రామంలో కూడా చెరువులు, బోర్లు, బావులు, ఎండిపోయిన సంఘటన మచ్చుక కూడా కనిపించడం లేదు.

కృష్ణపట్టె తండాల్లో తొలగిన తాగునీటి ఇక్కట్లు....
సీమాంధ్ర పాలనలో నాగార్జునసాగర్ నదీ పరివాహక ప్రాంతంలోని అనేక గిరిజన తం డాల్లో వేసవికాలం వచ్చిందంటే చాలు తాగునీటి ఎద్దడితో గిరిజనం తల్లడిల్లాల్సిన పరిస్థితి ఉండేది. గ్రామాల్లో చేతిపంపులు, బావులు పూర్తిగా ఎండిపోయి తాగునీటి కోసం మైళ్ల దూ రంలో ఉన్న వ్యవసాయ బావుల వద్ద నుంచి గిరిజన మహిళలు కుండలు, బిందెలతో నీటిని మోసుకోవాల్సి వచ్చేది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా తాగునీటి కోసం అన్వేషించేవా రు. మారుమూల గిరిజన తండాల్లో తాగునీటి కొరతను తట్టుకోలేక తండాల్లోని జనం పట్టణాలకు వలస వెళ్లేవారు. కనీసం ఇంటిముందకు కల్లాపి చల్లేందుకు కూడా నీరు దొరకని దయనీయ పరిస్థితులు ఉండేవి. స్నానం చేసేందుకు కూడా నీరు దొరకని గడ్డు పరిస్థితులతో జనం కాలం వెల్లబుచ్చేవారు. కృష్ణానది చెంతనే ఉన్నప్పటికీ దాని పరివాహక ప్రాంతంలోని గిరిజనతండాల్లో నిత్యం జనానికి తాగునీటి చింతనే ఉండేది. ఇప్పుడు మాత్రం మంచినీటి సమస్య అనే పదమే వినిపించడం లేదు. గ్రామాల్లోని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. బోర్లు, చేతిపంపుల్లో నీరు సమృద్ధిగా దొరుకుతుంది. తాగునీటి కష్టాలను పటాపంచలు చేసిన దేవుడిగా సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.

మత్స్యకారులకు ఉపాధి
చెరువులో వదిలిన లక్షలాది చేప పిల్లలు నేడు పెరిగి పెద్దవిగా మారి సుమారు వేలా ది టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులకు ఏడాది పొడవునా చేపలు పట్టుకొని అమ్ముకోని జీవించే ఉపాధి అవకాశాలు లభించాయి. గతంలో పేరూరులో నీళ్లు లేక చెరువు ఎండిపోయి ఉపాధి దొరకక సుమారు వంద మంది మత్స్యకార్మిక కుటుంబాలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. కాని టీఆర్‌ఎస్ నాలుగేళ్ల పాలనలో వర్షాలు సమృద్ధిగా పడి చెరువుల్లో నీరు పుష్కలంగా నీరు ఉండడంతోపాటు ఉచితంగా చేప పిల్లల పంపిణితో మత్స్యకారులకు మళ్లీ ఉపాది దొరికింది. ఏడాది పొడవునా చేపలను పట్టుకోని అమ్ముకోని తమ కుటుంబాలను సంతోషంగా పోషించుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...