పంటకు మద్దతు ధర అందజేయాలి


Thu,April 18, 2019 12:46 AM

నీలగిరి : రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వాటి ద్వా రా రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మం దిరంలో ధాన్యం కొనుగోళ్లపై డీఆర్‌డీఏ ద్వారా ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాలు, పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల అధికారులు, వ్యవసాయ శాఖ ఏడీలు, పౌర సరఫరాల అధికారులు, తూనికల కొలతల అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకేపీ ద్వారా 123 , పీఏసీఎస్ ద్వారా 67 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 8.87 మెట్రిక్ టన్నుల ధాన్యం కొ నుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం రాక అనుసరించి మిగతా కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించాలని సూచించా రు. ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి రైతుకు మ ద్దతు ధర అందించాలన్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలో పని చేయనివి ఉంటే వెంటనే రిపేర్ చేయించాలన్నారు. హమాలీల సమస్య లేకుండా ఎప్పటికప్పుడు ధాన్యా న్ని ట్యాగ్ చేసిన మిల్లులకు పం పించాలన్నారు. మిల్లర్లు సరిహద్దు రాష్ర్టాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లారీల ధాన్యం గాకుండా కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యానికే ప్రాధాన్యత నివ్వాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ రవీంద్రనాథ్, డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి, డీసీఓ శ్రీనివాసమూర్తి, వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, పౌర సరఫరాల అధికారి రమేష్, మేనేజర్ నాగేశ్వర్‌రావు ఉన్నారు.

166
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...