ఎన్నికల నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి


Wed,April 17, 2019 01:34 AM

-ఎన్నికల సంఘం జాయింట్ సెక్రెటరీ జయసింహారెడ్డి
నీలగిరి: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, నిబంధనలపై సిబ్బంది అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ సెక్రెటరీ ఎన్.జయసింహారెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్పీటీసీ ఎన్నికలకు ప్రతి మండలానికి ఒక జిల్లాస్థాయి అధికారిని రిటర్నింగ్ అధికారిగా, ఎంపీటీసీ ఎన్నికలకు గెజిటెడ్ అధికారులు మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు రిటర్నింగ్ అధికారులుగా ఉంటారని తెలిపారు. ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, జడ్పీటీసీ ఎన్నికలకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఉంటారని, ఎంపీటీసీ ఎన్నికలకు సూపరింటెండెంట్ స్థాయి అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఉంటారని తెలిపారు.

రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ ప్రచురణ, నామినేషన్ల స్వీకరణ, స్క్రూట్నీ, ఉపసంహరణ, తుది జాబితా తయారీ, గుర్తుల కేటాయింపు, పోస్టల్ బ్యాలెట్ ప్రచురణ, జారీ, బ్యాలెట్ బాక్స్‌ల తనిఖీ, పీఓ, ఏపీఓల డేటా బేస్, శిక్షణ నిర్వహణ, పోలింగ్ కేంద్రాల తనిఖీ, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, మోడల్ కోడ్ అమలు, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్ విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ ప్రతిపాదికన జరుగుతాయన్నారు. ఇన్‌చార్జి జేసీ, డీఆర్వో రవీంద్రనాథ్ మాట్లాడుతూ రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సమన్వయంతో పని చేసి రాబోయే ఎన్నికలను సజావుగా సాగేలా చూడాలన్నారు. రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రెయినర్లు ఎన్నికల నిర్వహణతో పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. సమావేశంలో జడ్పీ ఇన్‌చార్జి సీఈఓ రాజ్‌కుమార్, పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వర్‌రావు, మాస్టర్ ట్రెయినర్లు సాంబశివరావు, పరమేష్, బాలు, సలీం, తదితరులు పాల్గొన్నారు.

169
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...