యూడైస్ వివరాలు పక్కాగా నమోదు చేయాలి


Wed,April 17, 2019 01:33 AM

-సెక్టోరియల్ అధికారి శ్రీనివాసగౌడ్
-డైట్‌లో యూడైస్ ఎంట్రీపై శిక్షణ
రామగిరి : జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవే టు, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించి యూడైస్‌లో నమోదు చేసిన వివరాలను ఆన్‌లైన్‌లో పక్కాగా నమోదు చేయాలని సర్వశిక్ష అభియాన్ సెక్టోరియల్ అధికారి శ్రీనివాసగౌడ్ సూచించారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 31మండలాల ఎంఈఓ కార్యాలయాల్లో పని చేస్తున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, ఎల్‌డీఏలకు యూడైస్ ఆన్‌లైన్ నమోదుపై నల్లగొండలోని డైట్‌లో మంగళవారం శిక్షణ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూడైస్ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో ఏ మండలంలో, ఏ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు వారికి ఏ మేరకు వసతులు ఉన్నాయనేది తెలిసిపోతుందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే వీటి ని నమోదు చేయడం వల్ల వచ్చే విద్యా సంవత్సరానికి కావల్సిన వివరాలు స్పష్టమవుతాయన్నారు. దీని ద్వారానే ఆయా పాఠశాలలను గుర్తించి అదనపు వసతులు కల్పించడానికి అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఆన్‌లైన్ లో అడిగిన న మూనాలో వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాల్సిన బాధ్య త అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ ఏపీఓ ఆర్.భిక్షమాచారి, జిల్లాలోని ఎంఐఎస్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...