సమస్యల పరిష్కారానికి మండలిలో గళం విప్పుతా


Wed,April 17, 2019 01:33 AM

-ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి
మిర్యాలగూడటౌన్ : ఉపాధ్యాయ, అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో గళం విప్పుతానని నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. పట్టణంలోని అతిథి ఫంక్షన్‌హాల్లో టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి విజయోత్సవ సభను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయం సమస్థ ఉపాధ్యాయ, అధ్యాపకుల సమష్టి విజయంగా పేర్కొన్నారు. ఏ ఒక్క సంఘానికి పరిమితం కాకుండా అందరి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతానికి, సమాన విద్యావకాశాల కోసం కృషి చేస్తానన్నారు. ఉద్యోగుల హక్కులు, భద్రతలో భాగంగా సీపీఎస్ రద్దు, ఐఆర్, పీఆర్సీ, సర్వీస్‌రూల్స్, పండిట్, పీఈటీ అప్‌గ్రెడేషన్, మోడల్‌స్కూల్, కేజీబీవీ, కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడుతానన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ రాములు, చావ రవి మాట్లాడుతూ ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి ఐక్య కార్యాచరణ రూపొందిస్తామని, ఇందుకు అందరు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ సంఘాల ప్రతినిధులు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ వినతులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాజశేఖర్‌రెడ్డి, నాగమణి, బక్క శ్రీనివాస్‌చారి, డీటీఎఫ్ రాష్ట్ర నాయకులు గణేష్, నాయకులు నాగవెళ్లి ఉపేందర్, కోల శ్రీనివాస్, సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణమూర్తి, చినవెంకన్న, సురేందర్‌సింగ్, ఉపేందర్, అమరయ్య, శ్రీనివాస్‌నాయుడు పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...