కేసీఆర్‌తోనే సంచార జాతుల ఆర్థికాభివృద్ధి


Wed,April 17, 2019 01:33 AM

-ఆటో రిక్ష కొనుగోలు పథకాన్ని వర్తింపజేయాలి
-ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కోకన్వీనర్ సత్యనారాయణ
నల్లగొండరూరల్ : సంచార జాతుల కులాల ఆర్థికాభివృద్ధికి ఆటో రిక్షా కొనుగోలు పథకానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుందని ఈ పథకాన్ని నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకూ వర్తింపజేయాలని ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కోకన్వీనర్ కొండూరు సత్యనారాయణ కోరారు. మంగళవారం స్థానిక సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చారిత్రాత్మక , ఆధ్యాత్మిక ఆలయాలు కలిగిన నిర్మల్, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి, కొత్తగూడెం ప్రాంతాల్లో 2లక్షల 50వేల నుంచి 75 వేల వరకు 60 శాతం సబ్సిడీతో లబ్ధిదారుని వాటా 40శాతంతో ఆటో రిక్షాల కొనుగోలు పథకాన్ని ప్రారంభించాలన్నారు. ఈ ఆటో రిక్షా పథకాన్ని నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల్లో వర్తింపజేయాలన్నారు. మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ సహకారంతో ఈ పథకాన్ని జిల్లాలో అమలయ్యేలా కృషి చేస్తామన్నారు. సమావేశం లో టీఆర్‌ఎంబీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు చిలుకరాజు చెన్నయ్య, పగిల్ల సైదులు, ఆలకుంట్ల మోహన్, సీతారాములు, కొప్పుల మోహన్, గుంటి రమేష్, నిమ్మనగోటి కృష్ణయ్య, లకడాపురం వెంకన్న, మల్లేష్, దుగ్యాల శ్రీనివాస్, వెంకన్న పాల్గొన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...