18న దక్షిణ తెలంగాణ పరిశోధన సమావేశం


Wed,April 17, 2019 01:33 AM

నల్లగొండ, నమస్తేతెలంగాణ : హైదరాబాద్‌లోని ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ-దక్షిణ తెలంగాణమండల పరిశోధన ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులకు, రైతులకు విస్తరణ సలహా సంఘ సమావేశం నిర్వహించనున్నట్లు నల్లగొండ ఏరువాక కేంద్రం సమన్వయకర్త పీ.ఎస్.ఎం. ఫణిశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా రైతులు, వ్యవసాయ అధికారులు ఈ సమావేశంలో పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా 2017-18 యాసంగి, 2018 వానాకాలంలో చేపట్టిన పరిశోధన, విస్తరణ కార్యక్రమాల వివరాలను తెలియజేయనున్నట్లు తెలిపారు. వాటి ఫలితాలతో పాటు వచ్చే ఖరీఫ్, రబీలో ఏ రకమైన విత్తనాలు వాడితే బాగుంటుందనే కోణంలో ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. అయితే రైతులు ఈ సమావేశంలో పాల్గొని సూచనలు, సలహాలు అందజేయాలని కోరారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...