శోభాయమానం రాములోరి రథోత్సవం


Wed,April 17, 2019 01:33 AM

-ప్రారంభించిన శ్రీమాన్ పరాశర లక్ష్మీనృసింహభట్టార్ స్థానాచార్యులు, ఈఓ, ప్రముఖులు
-కళ్లు మిరుమిట్లు గొలిపేలా విద్యుత్‌కాంతులు....పటాకుల పేలుళ్లు
-ఆకట్టుకున్న చిన్నారుల కోలాట ప్రదర్శనలు, భజనలు
నల్లగొండకల్చరల్: జిల్లా కేంద్రంలో రెండోభద్రాద్రిగా పేరుగాంచిన శ్రీసీతారామచంద్రస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి నిర్వహించిన రథోత్సవం శోభాయమానంగా అంగరంగ వైభవంగా సాగింది. శ్రీరంగం దేవస్థానం స్ధానాచార్యులు శ్రీశ్రీశ్రీ శ్రీమాన్ పరాశర లక్ష్మీనృసింహ భట్టార్ ప్రత్యేక పర్యవేక్షణలో ఆలయ ఈఓ మొకిరాల రాజేశ్వరశర్మ, పలువురు ప్రముఖులు హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. అత్యధికంగా తరలివచ్చిన ప్రజలు శ్రీరాములోరి సేవలో తరించి రథోత్సవాన్నిలాగా ..చిన్నారుల కోలాట నృత్య ప్రదర్శనలు, భజనలు శాస్త్రియ నృత్యాలు, సాధువుల విన్యాసాల మధ్య రథోత్సవం ఆద్యంతం భక్తిభావాన్ని నింపేలా జరిగింది. నీలగిరి పురవీధులగుండా సాగిన రథోత్సవంలో బాలు మాస్టర్ బృందం చిన్నారులు వేసిన కోలాటాలు, వికాస తరంగిని సభ్యుల విష్ణు సహస్రనామ పారాయణ, రామనామ జపంతోపాటు రథోత్సవాన్ని అనుక్రయిస్తూ వేద పండితుల మంత్రోచ్ఛరణలు, వ్యాఖ్యాత తెలంగాణ దేవాలయాల అర్చక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జి.శేఖర్ విశిష్టతను తెలుపుతుండగా నీలగిరి పురవీధుల గుండా సాగింది.

హైదరాబాద్ నుంచి వచ్చిన పెంటబ్యాండ్ మేళాం విన్యాలు, శాలిగౌరారానికి చెందిన భజనకారుడు చిన్నరాములు అడుగులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుం చి రామగిరి, ఎన్జీ కళాశాల, ఎన్టీఆర్ విగ్రహం, టీటీడీ కల్యాణ మండపం మీదుగా తిరిగి రామాలయానికి చేరుకుంది. రథోత్సవం సాగినంత సేపు కళ్లు మిరుమిట్లు గొలిపేలా నింగిలో పటాకుల పేలుళ్లు ఆకట్టుకున్నాయి. రథోత్సవాన్ని తిలకిచేందుకు పట్టణ ప్రజలతోపాటు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు తరలిరావడంతో రథం సాగిన ప్రాంతాలు కిక్కిరిసాయి. కాగా రథోత్సవంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు కొనసాగించగా విద్యుత్‌శాఖాధికారులు రథంసాగే ప్రాంతాల్లో విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూశారు. రథోత్సవంలో ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల యాదగిరాచార్యులు, శఠగోపాలచార్యులు, కౌన్సిలర్లు రావుల శ్రీనివాస్‌రెడ్డి, అభిమన్యుశ్రీనివాస్‌తోపాటు ఆలయ మాజీచైర్మన్ చకిలం సంధ్యారాణివేణుగోపాల్, న్యాయవాది నూకల సంధ్యారాణి, టీటీడీ హిందూ ధర్మ ప్రచార సమితి సభ్యులు బుక్క ఈశ్వరయ్య, మెరుగు గోపి, పోలీసులు, ఆలయ సిబ్బంది, పాల్గొన్నారు,
ఆలయంలో పూజలు..బ్రహోత్సవాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం అర్చనలు, అష్టదిక్పాలక బలిహోమం, వేద పారాయణం, బలిహరణం కార్యక్రమాలు జరిగా యి. రథోత్సవానికి ఆలయంలో నుంచి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో తీసుకొచ్చారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...