పరీక్షలకు 97.1శాతం విద్యార్థుల హాజరు...


Wed,April 17, 2019 01:32 AM

నల్లగొండ, సూర్యాపేట జిల్లాకేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 8,191మంది విద్యార్థులు హాజరువాల్సి ఉండగా 7,956మంది విద్యార్థులు హాజరుకావడంతో 97.1శాతం హాజరునమోదైంది. కాగా నల్లగొండ జిల్లాకేంద్రంలోని 12 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు జిల్లావ్యాప్తంగా 5,041 మంది విద్యార్థులు హాజరుకావల్సి ఉండగా 4,879మంది హాజరుకాగా 162మంది గైర్హాజరయ్యా రు. వీరిలో బాలురు 3,055మందికి 2,962 మంది, బాలికలు 1,986మందికి 1,917మంది హాజరైనట్లు పరీక్షల రీజినల్ కోఆర్డినేటర్ నంబూరి శ్రీనివాసారావు వెల్లడించారు. అయితే అన్ని పరీక్ష కేంద్రాలను పరీక్షల ప్రత్యేక పరిశీలకులు అనిల్‌కుమార్, వెంకటేశ్వరావుతో కలిసి తనిఖీ చేశారు. సూర్యాపేటలో 7 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 3,150మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 3,077 మంది హాజరైన్నారు. వీరిలో బాలురు 1816 మందికిగాను 1,770 మంది, బాలికలు 1,334మందికి 1,307 మంది పరీక్షలు రా శారు. సూర్యాపేటలోని పరీక్షలను కో ఆర్డినేటర్, ప్రభుత్వ మహిళా పాలిటెక్ని క్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్.నర్సింహారావు, ప్రత్యేక పరీశీలకులు విజయ్‌కుమార్ పర్యవేక్షించారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...