మూగ జీవాలకు ధీమా 1962


Tue,April 16, 2019 02:37 AM

- అంబులెన్స్‌ల్లో పశువులకు వైద్యం
- ప్రతి నియోజకవర్గానికి ఒక్కో అంబులెన్స్ అందచేసిన సర్కార్
- ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటిముందుకు పాడి వైద్యం
- జిల్లాలో 2017 సెప్టెంబర్ నుంచి ప్రారంభమైన పశు వైద్య సేవలు

నల్లగొండ, నమస్తే తెలంగాణ: మూగజీవాలకు అత్య వసర వైద్యసేవలు అందించటానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1962 అంబులెన్సులు పాడి రంగానికి జీవం పోస్తున్నాయి. మూగజీవాలకు సుస్తి చేస్తే మృత్యు వాత పడాల్సిన పరిస్థితులు నాటివి..కానీ నేడు ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటి ముందరకే వైద్య సేవలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాడి రంగం పురోగమనానికి బాటలు పడ్డాయని చెప్పవచ్చు. గతేడాది జిల్లా వ్యాప్తంగా సర్కా ర్ నియోజకవర్గానికి ఒక అంబులెన్సును కేటాయిం చింది. అందులో ఓ డాక్టర్‌తోపాటు పారావెట్‌లు ఈ సేవలు అందిస్తున్నారు. 1962కు ఫోన్ కాల్ చేస్తే వెం టనే అక్కడకు వెళ్లి వైద్యం చేయటంతో పాడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2017 సెప్టెంబర్‌లో 19 62 వాహన సేవలు ప్రారంభం కాగా ప్రతి ఏటా 6 వేల నుంచి 8 వేల మూగ జీవాలకు సేవలందిస్తున్నారు. ఈ ఆర్థ్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు 6965 మూగ జీవా లకు వైద్య సేవలు అందించారు.

2017 సెప్టెంబర్ నుంచి ప్రారంభం
మూగజీవాలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగానే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గతేడాది ఈ సేవలు ప్రారంభించింది. నల్లగొండతోపాటు మునుగోడు, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నకిరేకల్, దేవరకొండ నియోజకవర్గాలకు ఒక్కో అంబులెన్సు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆయా అంబులెన్సులు 2017 సెప్టెంబ ర్ 20 నుంచి పశువులకు వైద్య సేవలు అందిస్తున్నాయి. పశువులతోపాటు గేదెలకు,గొర్రెలకు, మేకలకు, కోళ్లకు వైద్య సేవలు అందుతున్నాయి. వాహనంలో ఓ డాక్టర్‌తోపాటు పారావెట్, క్యాప్టెన్, హెల్పర్లు ఉంటారు. అంబులెన్స్‌లో ఆయా జీవాలకు సంబంధించిన అన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. అయితే ఒక్కఊరికి రైతు దగ్గరకు వెళ్లిన వీరు ఆ రైతు, ఆ గ్రామం లో ఉన్న అన్ని జీవాలకు చికిత్స చేసి వస్తున్నారు. వీరు వెటర్నరీ కేర్ రికార్డుతోపాటు వెటర్నరి క్లినిక్ రికార్డు, స్టాక్ రిజిస్టర్ నిర్వహిస్తారు. అయితే ఆదిలో అందరికి ఈ అంబులెన్స్‌పై పూర్తిస్థ్ధాయిలో అవగాహన లేనందున పెద్దగా కేసులు రాకపోగా ఇటీవల అవగాహన పెరిగి ఈ సేవలు విస్తరించబడ్డాయని చెప్పవచ్చు.

ఏటా 8 వేల పశువులకు వైద్యసేవలు
జిల్లాలో ఉన్నటువంటి 1962 అంబులెన్సులు ప్రతి సం వత్సరం 6 వేల నుంచి 8 వేల పశువులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 6965 పశువులకు వైద్య సేవలు అందించబడ్డాయి. 20 17 సెప్టెంబర్‌లో తొలుత నల్లగొండ నియోజక వర్గాని కి మాత్రమే ఒక్క అంబులెన్సు కేటాయించగా ఆ తర్వా త అన్ని నియోజక వ ర్గాలకు కూడా కేటాయించాయి. అయితే ఆరంభంలో ప్రజలకు అవగాహన లేక పెద్దగా కేసులు వచ్చేది కాదు. దాంతో అప్పట్లో ఊ రూరా ఈ వాహనాల్లో సిబ్బంది వెళ్ల్లి అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ నేప థ్యంలో ఇటీవల కేసు లు బాగా పెరిగాయి. 2017 సెప్టెంబర్ నుం చి ఇప్పటివరకు సుమా రు 15వేల పశువులకు చికిత్స చేయగా ఈ ఏడాది 69 65 పశువులకు సేవలు అందించబడ్డాయి. అయితే 19 62 అనే నెంబర్‌కు కాల్ చేసిన వెంటనే ఈ వాహ నం ఆ నియోజకవర్గ పరిధిలో మారుమూల గ్రామాల కు సైతం వెళ్లి చికిత్స చేసి మందులు అందజేస్తున్నారు.

ఈ ఏడాది నియోజకవర్గాల వారీగా....
జిల్లాలోని నల్లగొండ, నకిరేకల్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, మునుగోడు, దేవరకొండ నియోజక వర్గాలకు ఒక్కో 1962 వాహనం కేటాయించడంతో ఆ నియోజక వర్గాల పరిధిలో ఈ వాహనంలో ఉన్నటువంటి సిబ్బంది సకాలంలో కాల్ చేసి సమాచారం ఇచ్చినటువంటి రైతుల ఇంటికి వెళ్లి పాడి పశువులకు మేక లు, గొర్రెలు, కోళ్లకు చికిత్స చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆయా గ్రామాల్లో 3987 మంది 1962 కు కాల్ చేయగా 6965 పశువులకు చికిత్స చేశా రు. ఈ ఏడాది కాలంలో మొత్తంగా 32424 కిలోమీటర్లు ఈ వాహనం పర్యటించింది. నకిరేకల్ నియోజక వర్గంలో 1520 పశువులకు వైద్య సేవలు అందించగా మిర్యాలగూడలో 774, నల్లగొండలో 1579, నాగార్జునసాగర్ లో 991, మునుగోడులో 1237, దేవరకొండలో 864 పశువులకు వైద్య సేవలు అందించబడ్డాయి.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...