విధుల్లోకి .. నయా కార్యదర్శులు


Mon,April 15, 2019 02:04 AM

-576 మందికి నియామక ఉత్తర్వులు
-నేడు మరికొంత మందికి అందజేత
-నూతన కార్యదర్శులకు ఈనెల చివరి వారంలో శిక్షణ
-వికలాంగుల, స్పోర్ట్స్ కోటాలో ఆలస్యం
నీలగిరి: రాష్ట్ర సర్కార్ పల్లెల ప్రగతిపై దృష్టి సారించింది. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభు త్వం గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పక్కా ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం-18 అమలులోకి తీసుకురావడంతోపాటు క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసింది. అంతేగాక గ్రామాల్లో ప్రధాన భూమిక పోషించే పం చాయతీ కార్యదర్శుల ఇన్‌చార్జి పాలనకు స్వస్తి చెప్పి ప్రతి గ్రామానికి ఒకకార్యదర్శిని నియమించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకు సంబంధించి ఆగస్టు 2018లో నోటిఫికేషన్ జారీ చేసి అక్టోబర్‌లో రాత పరీక్ష నిర్వహించారు. ఫలితాల అనంతరం జిల్లాలు, కేటగిరి వారీగా ఆయా జిల్లాలో ఉన్న ఖాళీల ఆధారంగా మెరిట్ లిస్టు ప్రకారం అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితా సిద్ధం చేసి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశారు. ఈ క్రమంలో ఎంపిక జాబితా పారదర్శకంగా జరగలేదని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో నియామక ప్రక్రియను నిలిపివేశారు. విచారణ అనంతరం కోర్టు స్టేను ఎత్తివేసి నియామకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈలోగా అసెంబ్ల్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మరింత జాప్యం ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అనంతరం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపట్టింది. దీంతో సుమారు 3 నెలల నుంచి ఎదురు చూస్తున్న అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. జిల్లాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం ఎంపికైన 661 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గురువారం సాయంత్రం నుంచి ఉత్తర్వులు పంచాయతీ అదికారులకు అందజేస్తున్నారు.

పంచాయతీకో కార్యదర్శి
జిల్లాల పునర్విభజన అనంతరం జిల్లాలో 502 గ్రామ పంచాయతీలుండగా అందు లో గ్రేడ్.1,2,3 కలిపి కేవలం 184 మంది పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉన్నా రు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల అవసరాల దృష్ట్యా గిరిజన తండాలను గ్రామ పం చాయతీలుగా మార్చడంతో జిల్లాలో జిల్లా లో 844 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డా యి. ఈ నేపథ్యంలో ఒక్కో పంచాయతీ సెక్రటరీ మూడు నుంచి 7 పంచాయతీల విధులు నిర్వహింస్తున్నారు. దీంతో గ్రామాల రెవెన్యూపై దృష్టి పెట్టేవారు లేకపోవడం, అలాగే వివిధ పనుల నిమిత్తం పంచాయతీ కార్యాలయానికి వచ్చే ప్రజలకు కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీంతో సమస్యలు తలెత్తి గ్రామాభివృద్ధ్ది కుంటుపడింది. ఈ నేపథ్యంలో ప్రజలక ఇబ్బందులు లేకుండా ప్రజల వద్దకే పాలన అందించాలని ప్రభుత్వం సంకల్పించి సమూలమార్పులు చేపట్టింది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించాలని నిర్ణయించి ఆ దిశగా చర్యలు తీసుకుంది.

661 మంది నూతన కార్యదర్శులు
జిల్లాలో ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఖాళీల్లో 661 మంది నూతన కార్యదర్శులు జిల్లాకు మంజూరు చేశారు. అయితే వీటికి సంబంధించి గత ఆగస్టులో జిల్లాలో ఖాళీగా ఉన్న 661 మంది కొత్త పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిపికేషన్ జారీ చేసి అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహించింది. అసెంబ్ల్లీ ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభు త్వం మొదట పంచాయతీ కార్యదర్శుల ఫలితాలు వెల్లడంచి నియామక ప్రక్రియ చేపట్టాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. ప్రొవిజినల్ జాబితా ప్రకారం ఎంపిక చేసిన 661 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. 24 మంది అభ్యర్థులు గైరాజరయ్యారు. మిగిలిన 637 జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో పరిశీలించారు. 637 జూనియర్ పం చాయతీ సెక్రటరీలుగా ఎంపిక చేసినట్లు పంచాయతీరాజ్ అధికారులు వెల్లడించారు.

నిలిచిన స్పోర్ట్, వికలాంగుల కోటా నియమాకాలు
661 మందిలో స్పోర్ట్, వికలాంగుల కోటాలో కూడా అభ్యర్ధులను కూడా ప్రభుత్వం నియమించింది. అయితే ఆయా అభ్యర్థ్ధులకు సర్టిఫికెట్లను కూడా జిల్లా రెవెన్యూ అధికారి పరిశీలన చేశారు. అయితే ఆయా శాఖల కమిషనర్లు మరోమారు వారి స్పెషల్ కోటా సర్టిఫికేట్లు పరిశీలించిన తర్వాతే ఇవ్వాలని యంత్రాంగానికి సూచనలు చేయడంతో వాటిని జిల్లా కలెక్టర్ నిలిపివేశారు. మిగిలిన వారికి ఉత్తర్వలు అందజేశారు.
కార్యదర్శులే కీలకం.....
గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులే కీలకంగా మారనున్నారు. గ్రామాల ఆదాయ పరిమితులను పెంచడంతోపాటు ఆయ గ్రామాల అభివృద్ధ్దికి ప్రణాళికలు రుపొందించి మలు చేయా ల్సి ఉంది. ఇప్పటివరకు మూడు నుంచి ఏడు గ్రామాలు ఇం చార్జ్ విధులు నిర్వర్తిస్తుండడంతో కొన్ని సమస్యలు వచ్చాయ ని, ప్రభుత్వం తీసుకున్న ప్రతి గ్రామ పంచాయతీ ఇక కార్యదర్శి నిర్ణయంతో సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్నారు. అయితే ఈ గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు హరిత హారం ఇతర పథకాలను ప్రజలకు చెరవేయడంలో కూడా పంచాయతీ కార్యదర్శులు ప్రధాన భూమిక పోషిస్తారని పంచాయతీ అధికారులు చెబుతున్నారు.

త్వరలో నూతన కార్యదర్శులకు శిక్షణ
నూతన పంచాయతీ కార్యదర్శులగా నియమితులైన వారికి శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలోని 16 మంది ఎంపీడీఓ, ఈవోఆర్డీలను ఎంపిక చేసి జాబితాను రాష్ట్ర కమిషనర్‌కు అందజేశాం. వారికి శిక్షణ పూర్తయి న తర్వాత జిల్లాలో నూతన కార్యదర్శులకు శిక్షణ ఇస్తాం. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించడ వల్ల పల్లెలు అభివృద్ధిబాటలో పయనించే అవకాశం ఉంది. జిల్లా లో ఖాళీల ఆధారంగా మంది జాబితాను ఎంపిక చేశాం.
-విష్ణువర్దన్‌రెడ్డి, పంచాయతీ అధికారి, నల్లగొండ

193
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...