అంబేద్కర్ పోరాటం


Mon,April 15, 2019 02:03 AM

-విద్యా, ఆర్థికపరంగా ఎదిగినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యం
-అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి
-కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్
నల్లగొండ, నమస్తే తెలంగాణ : సాం ఘిక అసమానతలు, వివక్ష, కుల నిర్మూలనను రూపు మాపడంతో పాటు సమా న హక్కుల కోసం డా.బి.ఆర్ అంబేద్కర్ అలుపెరుగని పోరాటం చేశారని కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్ అన్నారు. అంబేద్కర్ 128వ జయంతిని పురస్కరించుకుని షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట, మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు ఆదివారం ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక అసమానత్వం, విద్య, వివక్ష, పేదరికం వంటి వాటిని నిర్మూలించేందుకు అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. కుల, మత రహిత సమాజ నిర్మాణానికి ఆయన కృషి అనిర్వచనీయమన్నారు. విద్యా పరంగా, ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ శించారన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రతిభ కనబర్చి ప్రతిభా మెడల్ సాధించడంతో పాటు సమాజంలో వేళ్లూనుకుపోయిన కుల వివక్షతపై చివరి వరకు పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. మహిళా వివక్షపై పోరాడుతూ సమ సమాజ స్థాపనకు కడవరకు పోరాడారన్నారు. రాజ్యాంగ ముసాయిదాకమిటీ చైర్మన్‌గా తన ఆలోచన విధానంలో అందరికి సమాన అవకాశాలు, ఓటు హక్కు, అసమానతలు లేని సమాజం, వివక్ష, నిర్మూలనకు సంబంధించిన అంశాలు రాజ్యాంగంలో పొందపర్చారన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాంఘిక సం క్షేమ శాఖ ఇన్‌చార్జి బీడీ రాజ్‌కుమార్, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...